Aisha Sultana : రాజద్రోహం కేసులో ఊరట- కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్
కేరళ నటి, నిర్మాత అయిషా సుల్తానాకు హైకోర్టులో ఇవాళ ఊరట లభించింది. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్‌ను ఉద్దశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఇందులో అరెస్టు కాకుండా కేరళ హైకోర్టు ఆమెకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు అయిషా సుల్తానాకు ఈ నెల 20న తమ ముందు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. దీంతో ఆమె బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం విచారణకు హాజరుకావాలని, ఆమెను పోలీసులు కనుక అరెస్టు చేస్తే బెయిల్‌పై విడుదల కావొచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆమె రెగ్యులర్ బెయిల్‌పై మాత్రం హైకో్ర్టు తుది ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.

Recommended Video
లక్షద్వీప్‌లో కరోనా వ్యాప్తికి కేంద్రం జీవాయుధం ప్రయోగించిందంటూ ఓ టీవీ ఛానల్ చర్చలో అయిషా సుల్తానా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ జీవాయుధం లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేలే అన్న అర్ధం వచ్చేట్టుగా ఆమె మాట్లాడారని పోలీసులు కేసు పెట్టారు. లక్షద్వీప్‌లో అడ్మినిస్ట్రేటర్‌గా ప్రఫుల్ పటేల్ రాకముందు కరోనా కేసులు లేవని, ఆయన వచ్చాక ఏకంగా 9 వేల కేసులు వచ్చాయని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో పోలీసులు ఆమెపై రాజద్రోహం కేసు పెట్టారు. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర బెయిల్ మంజూరైంది. మరోవైపు అయిషా సుల్తానా వ్యాఖ్యల్ని లక్షద్వీప్‌లో బీజేపీ సహా అన్ని పార్టీలు ఇప్పటికే సమర్ధించాయి.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications