కేరళలో కరోనా కల్లోలం.. 9246 కేసులు నమోదు

దైవభూమి కేరళలో కరోనా వైరస్ కేసుల ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 9246 కరోనా కేసులు వెలుగు చూశాయి. 88,733 మందికి పరీక్షలు చేయగా.. కేసులు వచ్చాయి. రాష్ట్రంలో 95,828 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వైరస్ నుంచి 10952 మంది కోలుకున్నారు. 10.1 శాతం యాక్టివ్ కేసులు మాత్రమే ఆస్పత్రులలో జాయిన్ అవుతున్నారు. గత 24 గంటల్లో 96 మంది కరోనాతో చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 26,667కి చేరుకుంది.

కరోనా సోకి ఆస్పత్రుల్లో ఉన్నవారి సంఖ్య 10986కి చేరింది. తిరువనంతపురంలో కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. 1363 రాగా.. ఎర్నకులంలో 1332, త్రిసూర్‌లో 1045, కొట్టాయం 838, కోజికోడ్ 669, కొల్లాం 590, ఇడుక్కిలో 582, అలప్పుజలో 513, కన్నూరులో 505, పతనమిట్టలో 490, పలక్కడ్‌లో 455, మలప్పురంలో 437, వాయనాడులో 249, కసర్ గడ్‌లో 178 కేసులు వచ్చాయి.

Kerala logs 9,246 new cases

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. వైరస్‌ను జయించేందుకు రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనిపై ప్రకటన రాలేదు.

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు డిసెంబర్ వరకు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు థర్డ్ వేవ్ ఇంపాక్ట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దానిని దాటేస్తే గానీ.. పరిస్థితి ఏంటో చెప్పలేమని ఒకవిధంగా వార్నింగ్ ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+