కరోనా సమాచారంతో ఫేస్ బుక్ పేజీకి లక్షల్లో ఫాలోయర్స్ ; ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కేరళ వ్యక్తికి స్థానం !!
ఒక మంచి పని దేశం గుర్తించేలా చేసింది. సామాజిక బాధ్యత గుర్తింపు తెచ్చింది. సమాచారం అందరికీ ఉపయోగపడేలా చేసింది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కేలా చేసింది. కేరళకు సంబంధించిన కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి తాజాగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖలో జూనియర్ క్లర్క్ గా పని చేస్తున్న కృష్ణ ప్రసాద్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకోవడానికి గల కారణం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

సోషల్ మీడియా ద్వారా కరోనాపై సమాచారం ..10,800 కి పైగా పోస్ట్ లు
సోషల్ మీడియా కార్యకర్తల్లో ఒకరైన కృష్ణ ప్రసాద్, తన ఫేస్ బుక్ పేజీలో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు అన్ని వివరాలను ఇస్తూ కరోనా కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఫేస్ బుక్ పేజ్ లో పొందుపరిచిన కారణంగా ఆయనకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పించారు. ఏప్రిల్ 2020లో కరోనా మహమ్మారి గురించి గణాంకాలను ఒక అభిరుచిగా సేకరించడం ప్రారంభించిన కృష్ణ ప్రసాద్ తరువాత, కరోనా కు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయడం పై ఆసక్తి కనబరిచారు. దీంతో ఆయన అన్ని వివరాలను ఫేస్బుక్ పేజీలో రోజువారి తప్పకుండా పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుండి ఇప్పటివరకు 10,800 కి పైగా కరోనా మహమ్మారికి సంబంధించిన అప్‌డేట్‌లను పోస్ట్ చేశారు అని జూనియర్ క్లర్క్‌గా రాష్ట్ర ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కృష్ణప్రసాద్ చెప్పారు.

కరోనాకు సంబంధించిన వన్ స్టాప్ డెస్టినేషన్ లా ఫేస్ బుక్ పేజ్
టీకా స్లాట్లు, బెడ్ లభ్యత వంటి వివరాలను, మొత్తం కేసులు , కోలుకున్న రోగుల సంఖ్య తో పాటు అన్ని రకాల కరోనా సమాచారాన్ని 'వన్ స్టాప్ డెస్టినేషన్' లాగా ఆయన అందించారు. కేరళ రాష్ట్రంలో మహమ్మారికి సంబంధించిన అన్ని వివరాలను తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలియజేశారు. ఫేస్బుక్ పేజీలో దేశానికి సంబంధించి, ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసులు మరియు మరణాల వివరాలకు సంబంధించి కూడా సమగ్ర వివరాలను అందించారు. ఇక కృష్ణ ప్రసాద్ అందించే సమాచారానికి లక్ష మందికి పైగా ప్రజలు ఆసక్తి కనబరిచి, ఆయన పేజ్ ను ఫాలో అవుతున్నారు.

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించటంలో కీలక పాత్ర
కరోనా మహమ్మారిపై ముఖ్యమైన వైద్య పత్రికలతోపాటు, అందుబాటులో ఉన్న శాస్త్రీయ పత్రాలను కృష్ణప్రసాద్ తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలియజేశారు. కరోనా మహమ్మారికి సంబంధించిన అనేక అనుమానాలకు ఆయన తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా నివృత్తి సూచించారు. కరోనాపై జరుగుతున్న ఫేక్ ప్రచారాలపై కూడా ప్రజల్లో అవగాహన కల్గించారు. ప్రజల్లో ఉన్న కన్ఫ్యూజన్ ను కూడా దూరం చేశారు. వాస్తవ సమాచారాన్ని అందించి కరోనాకు సంబంధించి ప్రభుత్వాలు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాయో అంతకు మించి బాధ్యతతో వ్యవహరించారు కృష్ణప్రసాద్. ఒకపక్క వృత్తి ధర్మాన్ని, మరోపక్క సామాజిక బాధ్యతను రెండిటినీ నిర్వర్తించారు.

కేరళ వైద్య ఆరోగ్య శాఖలో క్లర్క్ గా విధులు .. ఆపై సోషల్ మీడియాలో కరోనా సమాచారం
ఇక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్ క్లర్క్ గా పనిచేస్తున్న కృష్ణ ప్రసాద్, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగంలో బిజీగా ఉన్నానని , కాబట్టి, రాత్రి సమయాలలో కరోనా కు సంబంధించిన సమాచారాన్ని రెగ్యులర్ గా అప్ డేట్ చేశానని వెల్లడించారు. దేశ విదేశాల నుండి చాలామంది వైద్యనిపుణులు, డేటా నిపుణులు తనను ప్రోత్సహించారని, వారు ఇచ్చిన సమాచారాన్ని కూడా తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా అందరికీ తెలియజేశానని కృష్ణ ప్రసాద్ తెలిపారు. సమాజం పట్ల ఉన్న కర్తవ్యంగా భావించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని తెలిపారు. ఇక ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న అతని భార్య ఎంతగానో సహకరించిందని, ఆమె శంకర నాకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేయడంలో తనకు స్ఫూర్తినిచ్చాయని కృష్ణ ప్రసాద్ చెప్పుకొచ్చారు.

డేటా విశ్లేషణ అభిరుచి, సామాజిక బాధ్యతలతో కృష్ణ ప్రసాద్ ఫేస్బుక్ పేజి
డేటా విశ్లేషణ తన అభిరుచి అని పేర్కొన్న కృష్ణప్రసాద్ ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్నారు. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ డేటా సేకరణ చాలా శ్రమతో కూడుకున్నదని మరియు దాని ఖచ్చితత్వాన్ని తనిఖీ చేయడం సమయం తీసుకుంటుందని వెల్లడించారు. తాను అన్ని వైద్య సంస్థలు, వైద్య పత్రికలు, నిపుణులు, ట్విట్టర్ హ్యాండిల్స్ మరియు పరిశోధన పత్రాల అధికారిక వెబ్‌సైట్‌లను క్రమం తప్పకుండా స్కాన్ చేస్తానని , డేటాను విశ్లేషించడంలో నా ఆసక్తి అందుకు ఎంతగానో ఉపకరించింది అని ఆయన పేర్కొన్నారు.
Recommended Video

ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన కృష్ణ ప్రసాద్
సామాజిక నిబద్ధత మరియు అభిరుచి అన్నీ కలగలసిన తనను చాలా మంది నిపుణులు ప్రోత్సహించారని, తమ డేటాను తనతో పంచుకుంటున్నారని ఆయన అన్నారు. నిబద్ధత కలిగిన సామాజిక కార్యకర్తగా కరోనా కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించడంలో ఆయన చేసిన కృషిని మెచ్చుకున్న ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కృష్ణ ప్రసాద్ కు స్థానం కల్పించింది. ఒకే ఒక వ్యక్తి ఒక సైన్యంగా పనిచేయడం స్ఫూర్తిదాయకమని సంస్థ పేర్కొంది. ఆగస్టు 3వ తేదీన ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కేరళకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ జూనియర్ క్లర్క్ కృష్ణ ప్రసాద్ స్థానం కల్పించి గౌరవించింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications