Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లిక్కర్ కిక్కులో అపార్ట్ మెంట్ లో చిందులు వేసిన జైలర్ విలన్, కథ, స్క్రీన్ ప్లే అంతా ఆయనే !

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ఎన్ని రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. రజనీకాంత్ స్టామినాను మరోసారి నిరూపించుకున్న జైలర్ సినిమా ఎవ్వరూ ఊహించని రికార్డులు సొంతం చేసుకుంది. జైలర్ సినిమా సూపర్ హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు.

అయితే జైలర్ సినిమా ఎవ్వరూ ఊహించని విదంగా సూపర్ డూపర్ హిట్ కావడమే కాకుండా నిర్మాతలకు కనకవర్షం కురిపించింది. జైలర్ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) తోపాటు ఆ సినిమాలో విలన్ గా నటించిన మలయాళం నటుడు వినాయకన్ కు చాల మంచిపేరు వచ్చింది. రజనీకాంత్ తో సమానంగా వినల్ పాత్ర పోషించిన వినాయకన్ కు రాత్రికి రాత్రి స్టార్ డమ్ వచ్చేసింది.

Kerala Police Arrests Rajinikanth Jailer Movie Actor Vinayakan For Quarrel In Apartment

తమిళ్, మలయాళంతో పాటు తెలుగు, హిందీ సినిమాల్లో వినాయకన్ కు ఆఫర్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో జైలర్ విలన్ నిజజీవితంలో కూడా విలన్ అనే చెడ్డపేరు తెచ్చుకున్నాడని కేరళ పోలీసులు అంటున్నారు. రాత్రికి రాత్రి వినాయకన్ ను అరెస్టు చేసిన కేరళలోని ఎర్నాకులం పోలీసులు తరువాత ఆయనకు స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు.

కేరళలోని ఎర్నాకుళంలో టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్ పరిదిలోని ఓ అపార్ట్ మెంట్ లో భార్యతో కలిసి నటుడు వినాయకన్ నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి మద్యం మత్తులో వినాయకన్ (vinayakan) అతని భార్యతో గొడవపడ్డాడని, అపార్ట్ మెంట్ దద్దరిల్లేలా నానా హంగామా చేశాడని తెలిసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వినాయకన్ నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోకి వెళ్లి ఆయనతో మాట్లాడారు.

Kerala Police Arrests Rajinikanth Jailer Movie Actor Vinayakan For Quarrel In Apartment

ఆ సందర్బంలో వినాయకన్ అతని భార్యతో పాటు పోలీసులతో దురుసగా ప్రవర్తించాడని తెలిసింది. ఇక లాభం లేదని అనుకున్న పోలీసులు నటుడు వినాయకన్ కు కౌన్సిలింగ్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు పిలుచుకుని వెళ్లారు. అప్పటికే కిక్కు నసాలానికి ఎక్కిపోవడంతో నటుడు వినాయకన్ పోలీస్ స్టేషన్ లో చిందులు వేశాడని సమాచారం.

ఇక లాభంలేదని అనుకున్న పోలీసులు నటుడు వినాయకన్ ను ఎర్నాకులం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సార్ ఎంత మోతాదులో మద్యం సేవించాడు అని వైద్యపరీక్షలు చేయించారు. తరువాత నటుడు వినాయకన్ కు స్వీట్ గా వార్నింగ్ ఇచ్చిన పోలీసు అధికారులు మరోసారి ఇలా జరిగితే కథ, స్క్రీన్ ప్లే వేరుగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చి అతన్ని బెయిల్ మీద విడుదల చేసి అతను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ దగ్గర వదిలేశారని తెలిసింది.

నటుడు వినాయకన్ అరెస్టు కావడంతో రకరకాలుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న మహిళలతో నటుడు వినాయకన్ అసభ్యంగా ప్రవర్తించాడని వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే తనను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో, ఎందుకు స్టేషన్ బెయిల్ ఇచ్చారో తనను ఇంతవరకు అర్థం కావడం లేదని నటుడు వినాయకన్ అంటున్నారు. అయితే ఫ్యామిలీ మ్యాటర్ కావడంతో పోలీసులు కూడా వినాయకన్ కు వార్నింగ్ ఇచ్చి బెయిల్ వచ్చే సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి విడుదల చేశారని తెలిసింది.

మొత్తం మీద జైలర్ సినిమా (jailer movie) హిట్ తో అనేక ఆఫర్లు అందుకున్న నటుడు వినాయకన్ మద్యం మత్తులో హంగామా చేసి ఇప్పుడు నవ్వులపాలు కావడం సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే నటుడు వినాయకన్ హంగామాకు అసలు మ్యాటర్ ఏమిటి ? అని కేరళ పోలీసులు అధికారికంగా ఇంత వరకు చెప్పలేదని మలయాళం మీడియా అంటోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+