స్నేహితులే కాలయముళ్లు: దాడి చేసి, గొడ్డలితో ముక్కలుగా నరికి.. రబ్బర్ ఫ్యాక్టరీలో ఖననం..
ఏం జరిగిందో తెలియదు, గొడవ ఎందుకు మొదలైందో క్లారిటీ లేదు. కానీ స్నేహితుడిని క్లాస్ మేట్స్ హతమార్చారు. అతనిపై ఉన్న కోపమో ఏమో కానీ.. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి.. రబ్బర్ ఫ్యాక్టరీలో ఖననం చేశారు. కేరళ పతనంతిట్ట జిల్లాలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది.
గత వీకెండ్‌లో అంగడిక్కల్‌కు చెందిన అఖిల్, అతని స్నేహితులు కొడుమాన్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వారికి ఆట విషయంలో గొడవ జరిగిందని ఒక వాదన వినిపిస్తోండగా.. సోషల్ మీడియాలో పోస్ట్ గురించి చర్చ జరిగిందని మరో వాదన జరుగుతోంది. కానీ కోపోద్రిక్తులైన తన స్నేహితుడు అని కూడా చూడలేదు. దారుణంగా హతమార్చారు.

Recommended Video
అఖిల్‌పై దాడి చేశారు. అతను సృహ కోల్పోవడంతో శరీరాన్ని గొడ్డలితో ముక్కలు ముక్కలుగా కోసేశారు. తర్వాత సమీపంలో గల రబ్బర్ ఫ్యాక్టరీలో అతని మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే వారికి గొడ్డలి ఎక్కడినుంచి వచ్చింది.. ముందే ప్లాన్ చేసుకొని తీసుకొచ్చారా అని పోలీసులు అనుమానిస్తున్నారు. అఖిల్ హత్యకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు గల కారణంపై విచారణ జరుపుతున్నామన పేర్కొన్నారు. విచారణలో నిజనిజాలు బయటపడతాయని పోలీసులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications