కేరళ రైలులో అగ్నిప్రమాదం, పెట్రోల్ పోసి నిప్పంటించారు. మహారాష్ట్రలో షారుఖ్ అందర్ !

తిరువనంతపురం/ముంబాయి: కేరళలోని కొజీకోడ్ రైలులో మంటలు చెలరేగిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు, కేరళ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం పోలీసులు మహారాష్ట్రలోని రత్నగిరిలో నిందితుడిని పట్టుకున్నారు.

కేరళలోని రైలులో జరిగిన అరాచకానికి కారణం అయిన షారుఖ్ సైఫీ (24) అనే నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. కోజీకోడ్ జిల్లాలోని ఎలత్తూర్ సమీపంలో అలప్పుజా-కన్నూరు మెయిన్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలు డి-1 కోచ్‌లో పెట్రోల్ పోసి నిప్పంటించి పరారైనారు. కేరళలోని రైలులోపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో ముగ్గురు అమాయకుల ప్రాణాలు కోల్పోయాయి.

Kozhikode train fire incident

రైలులో పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసు దర్యాప్తు చేసేందుకు 18 మంది సభ్యులతో కూడిన సిట్ మంగళవారం కేరళలోని కోజీకోడ్‌లో తొలి సమావేశాన్ని నిర్వహించింది. ఈ ప్రత్యేక సమావేశం అనంతరం ఓ అధికారి మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరుగుతోందని, బృందంలోని ప్రతి సభ్యునికి ప్రత్యేకంగా పనులు అప్పగించామని ఓ అధికారి తెలియజేశారు.

విచారణ తీరును కూడా సమావేశం నిర్దేశించిందని. అందుకే విచారణ ప్రాథమిక దశలో ఉందని, తదుపరి విచారణ తరువాతే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఆ అధికారి స్థానిక మీడియాకు చెప్పారు. అయితే ఈ కేసులో అరెస్టుఅయిన షారుఖ్ సైఫీని విచారణ చేస్తే మరన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని, ఈ సంఘటన వెనుక ఎవరెవరు ఉన్నారు ? అని ఆరా తీస్తున్నామని అధికారులు అంటున్నారు. మొత్తం మీద కేరళలో రైలులో పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసులో ఓ నిందితుడు చిక్కడంతో కేసు అనేక మలుపులు తిరిగే అవకాశం ఉందని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+