సాహసోపేత నిర్ణయం: అక్కడ దేవాలయాల్లో పూజారులుగా.. దళితులు, బ్రాహ్మణేతరులు!
కేరళ ట్రావన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఆ బోర్డు ఆధ్వర్యంలో పలు దేవాలయాల్లో దళితులను, బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించాలని బోర్డు సభ్యులు ఇటీవల నిర్ణయం తీసుకున్నారు.
తిరువనంతపురం: కేరళ ట్రావన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఆ బోర్డు ఆధ్వర్యంలో 1,248 దేవాలయాలు ఉన్నాయి. పలు దేవాలయాల్లో మొత్తం 62 మంది పూజారులను నియమించాలని బోర్డు సభ్యులు ఇటీవల నిర్ణయం తీసుకున్నారు.
వీరిలో 26 మంది అగ్రకులాల వారిని, 36 మంది బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించడానికి చకచకా ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. విశేషం ఏమిటంటే.. వీరిలో ఆరుగురు దళితులు కూడా ఉండటం.

దళితులను పూజారులుగా చేయాలని ఓ దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి. పూజారుల నియామకాల కోసం ఇప్పటికే రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగకుండా చూస్తామని ట్రావన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు సభ్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications