రూ.45.69 లక్షల కరెన్సీ... అరటిపండ్లలో దాచిపెట్టి... దేశం దాటించబోయారు

అరటిపండ్లలోని గుజ్జును తీసేసి.. అందులో రూ.45.69 లక్షలు దాచిపెట్టి.. ఎవరికీ అనుమానం రాకుండా దేశం దాటించేందుకు ప్రయత్నించారు ఇద్దరు ప్రబుద్ధులు. చివరికి బండారం బయటపడి పట్టుబడిపోయారు.

కోజికోడ్: నేరగాళ్లు తెలివి మీరిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతులు, దారులు వెతుక్కుంటున్నారు. ఈ విషయం వింటే.. 'వార్నీ.. ఇలా కూడా చేస్తారా..?' అని అశ్చర్యపోతారు మీరు.

అరటిపండ్లలోని గుజ్జును తీసేసి.. అందులో రూ.45.69 లక్షలు దాచిపెట్టి.. ఎవరికీ అనుమానం రాకుండా దేశం దాటించేందుకు ప్రయత్నించారు ఇద్దరు ప్రబుద్ధులు. చివరికి బండారం బయటపడి పట్టుబడిపోయారు.

 Kerala: Two Dubai-bound passengers use bananas to smuggle Saudi currency

ఈ సంఘటన కోజికోడ్ లో చోటు చేసుకుంది. కోజికోడ్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్తున్న ఇద్దరు ప్రయాణికులు తమ చెకిన్ లగేజీలో తీసుకెళుతున్న అరటి పళ్లలో గుజ్జును తీసేసి వాటిలో రూ.45.69 లక్షల విలువైన సౌదీ రియాల్స్ ను దాచి ఉంచారు.

అయితే వీరి పాచిక ఏమాత్రం పారలేదు. విమానాశ్రయంలో తనిఖీ అధికారులకు పట్టుబడిపోయారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజన్స్ అధికారులు ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ప్రయాణికులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+