అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన

ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం మరోసారి వేడెక్కింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇటీవల ఇరాన్- అమెరికా మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇటు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సైన్యం ఒకరిపై ఒకరు సంచలన వార్నింగ్ చేసుకుంటున్నారు. వ్యూహాత్మకంగా ప్రధానం అయిన హార్మూజ్ జలసంధి చూట్టూనే ఇప్పుడు ఇరాన్- అమెరికా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక హార్మూజ్ జలసంధిని పూర్తిగా దిగ్బంధిస్తామని ట్రంప్ ప్రకటన చేసిన నేపథ్యంలో భారత్ కు చెందిన దాదాపు 15 నౌకలు సైతం హార్మూజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయాయి. దాంతో భారత్ లో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు మొదలయ్యాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ పై ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇల్లాహీ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా యుద్ధ సమయంలో తమకు భారత ప్రభుత్వం, ఇక్కడి ప్రజలు అండగా నిలిచారని అన్నారు. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఖమేనీతోపాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఒకేసారి హతం అయ్యారు. అయితే ఖమేనీ మృతి చెంది 40 రోజులు పూర్తయిన సందర్భంగా దేశ రాజధాని దిల్లీలో సంతాప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన భారత్ లోని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇల్లాహీ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.

" నేను భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్లు మాకు అండగా నిలిచారు. మా సుప్రీం నాయకుడు మృతి చెందడంతో సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది ప్రభుత్వ అధికారులు, అన్ని పార్టీల నుంచి నాయకులు పాల్గొన్నారు. మేము మీ అందరికీ రుణపడి ఉన్నాము" అని అబ్దుల్ మజీద్ హకీమ్ ఇల్లాహీ పేర్కొన్నారు. దిల్లీలోని ఇండియన్ కల్చరల్ సెంటర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇల్లాహీ మాట్లాడుతూ.. తమ నాయకుడు మానవత్వం, న్యాయం కోసం పోరాటం చేసి మృతి చెందారని అన్నారు. ఇది కేవలం సంతాప సభ మాత్రమే కాదని.. తమకు అండగా నిలిచిన భారత ప్రభుత్వం, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమం అని పేర్కొన్నారు.

Khamenei Chehlum in Delhi Iran Supreme Leader Representative Praises India s Support After 40 Days

ఇక ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా బలగాలు సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ 86 ఏళ్ల అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఆయన్ను అమెరికా- ఇజ్రాయెల్ బలగాలు ఫిబ్రవరి 28న హతమార్చాయి. దాంతో అతని కుమారుడు మోజ్తాబా ఖమేనీ ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+