Khiladi lady: హిందువు పేరుతో ఆధార్ కార్డు, పాస్ పోర్టు, 12 ఏళ్లకే దేశం దాటింది, బార్ డ్యాన్సర్ గా !
బెంగళూరు/ముంబాయి: అక్రమంగా విదేశాల నుంచి భారత్ లోకి వచ్చిన యువతి తాను హిందూ అంటూ ఇంతకాలం అందరిని మోసం చేసింది. విదేశాల నుంచి అక్రమంగా భారత్ లో వచ్చిన ఆ అమ్మాయి వయసుకు వచ్చిన తరువాత బార్ డ్యాన్సర్ అవతారం ఎత్తింది. బార్ డ్యాన్సర్ గా డబ్బులు సంపాధిస్తున్న ఆమె ఓ యువకుడితో ప్రేమలో పడింది. యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ముస్లీం మతానికి చెందిన ఆమె తాను హిందువు అంటూ ప్రియుడితో కలిసి అందరినీ మోసం చేస్తూ వచ్చింది. ప్రియుడిని వివాహం చేసుకున్న ఆ ముస్లీం యువతి తాను హిందువు అంటూ భర్తతో కలిసి పాన్ కార్డు తీసుంది. ఆ తరువాత స్నేహితురాలి సహాయంతో ఐటీ హబ్ చేరుకున్న మహిళ హిందువు అంటూ ఆధార్ కార్డు తీసుకుంది. విదేశాల నుంచి ఐటీ హబ్ లో అక్రమంగా మకాం వెయ్యడమే కాకుండా ప్రభుత్వాలను మోసం చేసి ముస్లీం మహిళ ఆమె హిందువు పేరుతో ప్రభుత్వ గుర్తింపు కార్డులు తీసుకుందని పోలీసులకు పక్కా సమాచారం అందడం, పోలీసులు అరెస్టు చెయ్యడంతో స్థానిక ప్రజలు హడలిపోయారు.

12 ఏళ్లకే దేశం దాటేసింది
బంగ్లాదేశ్ కు చెందిన రోని బేగం అలియాస్ రోని బంగ్లాదేశ్ లో పుట్టింది. తల్లిదండ్రులతో కలిసి బాంగ్లాదేశ్ లో నివసిస్తున్న రోని బేగం ఆమెకు 12 ఏళ్ల వయసు ఉన్న టైమ్ లోనే దేశ సరిహద్దులు దాటేసి దలారీల సహాయంతో అక్రమంగా భారతదేశంలోచి వచ్చింది. 2005లొ భారత్ లోకి వచ్చిన రోని బేగం తరువాత పశ్చిమ బెంగాల్ లో కొంతకాలం తలదాచుకుంది.

బార్ డ్యాన్సర్ గా దున్మేసింది
వయసుకు వచ్చిన రోనీ బేగం వయసు ఇప్పుడు 27 సంవత్సరాలు. వయసులోకి వచ్చిన రోనీ బేగం తరువాత పశ్చిమ బెంగాల్ నుంచి ముంబాయి చేరుకుని అక్కడ బార్ డ్యాన్సర్ గా అవతారం ఎత్తింది. తన అందచందాలతో కొన్ని సంవత్సరాల పాటు ముంబాయిలో రోనీ బేగం బార్ డ్యాన్సర్ గా దున్నేసిందని తెలిసింది.

పాయల్ ఘోష్ గా పేరు మార్చుకున్న రోనీ బేగం
ముంబాయిలో బార్ డ్యాన్సర్ గా పని చేసే సమయంలోనే రోనీ బేగంకు కర్ణాటకలోని మంగళూరుకు చెందిన నితిన్ కుమార్ అలియాస్ నితిన్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆ సమయంలో తన పేరు పాయల్ ఘోష్ అని, మాది పశ్చిమ బెంగాల్ అని రోనీ బేగం అందరిని పరిచయం చేసుకుంది,

ప్రియుడితో పెళ్లి.... హిందువు పేరుతో పాన్ కార్డ్
తరువాత నితిన్ కుమార్ ప్రేమలో పడిన రోనీ బేగం అలియాస్ పాయల్ ఘోష్ అతన్ని వివాహం చేసుకుంది. ముస్లీం మతానికి చెందిన రోనీ బేగం తాను హిందువు, తన పేరు పాయల్ ఘోష్ అంటూ ఆమె ప్రియుడు నితిన్ కుమార్ తో కలిసి అందరినీ మోసం చేస్తూ వచ్చింది. నితిన్ కుమార్ ను వివాహం చేసుకున్న రోనీ బేగం తాను హిందువు అంటూ భర్త నితిన్ కుమార్ తో కలిసి ముంబాయిలో ప్రభుత్వాన్ని మోసం చేసి పాన్ కార్డు తీసుకున్నారు.

బెంగళూరులో కాపురం
2019లో ముంబాయి నుంచి బెంగళూరు చేరుకున్న నితిన్ కుమార్, రోనీ బేగం అలియాస్ పాయల్ ఘోష్ ఇక్కడి మాగడి రోడ్డులోని అంజనా నగర్ లో అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. రోనీ బేగం బార్ డ్యాన్సర్ పని వదిలేసి టైలర్ పని చేస్తోంది. రోనీ బేగం భర్త నితిన్ కుమార్ ఫుడ్ డెలవరీ అవతారం ఎత్తి గుట్టుచప్పుడు కాకుండా కాలం గడుపుతున్నారు.

పక్కా ప్లాన్ తో బంగ్లాదేశ్ వెళ్లాలని ?
బెంగళూరులో మకాం వేసిన తరువాత రోనీ బేగం ఆమె స్నేహితురాలు కర్మీ సహాయంతో ఐటీ హబ్ తాను హిందువు, తన పేరు పాయల్ ఘొష్ అంటూ బెంగళూరులో ఆధార్ కార్డు, పాస్ పోర్డు తీసుకుంది. 2020లో బంగ్లాదేశ్ లో నివాసం ఉంటున్న రోనీ బేగం తండ్రి చనిపోయాడు. కోల్ కత్తా వెళ్లిన రోనీ బేగం అక్కడి నుంచి బాంగ్లాదేశ్ వెళ్లడానికి ప్రయత్నించింది. రోనీ బేగం పాస్ పోర్టు, ఆమె ఆధార్ కార్డు, పాన్ కార్డు పరిశీలించిన పోలీసు అధికారులు అసలు మ్యాటర్ తెలుసుకుని హడలిపోయారు.

మ్యాటర్ మొత్తం లీక్
బంగ్లాదేశ్ నుంచి ఐటీ హబ్ లో అక్రమంగా మకాం వెయ్యడమే కాకుండా ప్రభుత్వాలను మోసం చేస్తున్న ముస్లీం మహిళ రోనీ బేగం ఆమె హిందువు పేరుతో ప్రభుత్వ గుర్తింపు కార్డులు తీసుకుందని బెంగళూరు పోలీసులకు పక్కా సమాచారం అందింది. బెంగళూరు పోలీసులు రోనీ బేగంను అరెస్టు చెయ్యడంతో మాగడి రోడ్డులోని అంజనా నగర ప్రజలు హడలిపోయారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications