Khiladi lady: మాఫియా డాన్ గర్ల్ ఫ్రెండ్ అరెస్టు, దేశం వదిలేసి ఐటీ హబ్ లో మకాం, మేడమ్ ప్రియుడు!
బెంగళూరు/చెన్నై/ కోయంబత్తూరు: మాఫియా డాన్, పేరు మోసిన డ్రగ్స్ డీలింగ్ కింగ్ ప్రియురాలు, ఆమె అనుచరుడు కొన్ని సంవత్సరాల తరువాత పోలీసులకు చిక్కిపోయారు. దేశం వదిలిపారిపోయి వచ్చి ఐటీ హబ్ లో గుట్టుచప్పుడు కాకుండా తలదాచుకున్న కిలాడీ లేడీని, ఆమె అనుచరుడిని పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికే మాఫియా డాన్ చనిపోయాడు. విష ప్రయోగంతో మాఫియా డాన్ ను చంపేశారని ఆరోపణలు ఉన్నాయి. మాఫియా డాన్ అనుచరులు చాలా మంది ఎన్ కౌంటర్ లో అంతం కాగా కొందరిని పోలీసులు అరెస్టు చేశారు.
భారతదేశంలో మాఫియా డాన్ అనుచరుల కోసం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చాలా కాలంగా గాలిస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న కిలాడీ లేడీ పోలీసులకు చిక్కిపోయింది. మాఫియా డాన్ రెండు దేశాల్లో చాలా మంది మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకుని వారితో ఎంజాయ్ చేశాడని, ప్రధాన ప్రియురాలు ఇప్పటికే ఎన్ కౌంటర్ లో అంతం అయ్యిందని పోలీసు అధికారులు అంటున్నారు. మాఫియా డాన్ శిష్యురాలు ఐటీ హబ్ లో ఇంతకాలం సీక్రేట్ గా అతని వ్యాపారాలు కొనసాగిస్తోందని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పేరు మోసిన మాఫియా డాన్
శ్రీలంకకు చెందిన అంగోడా లోక్క పేరు మోసిన మాఫియా డాన్. శ్రీలంక నుంచి విదేశాలకు అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంగోడా లోక్క ఆదేశంలో పేరు మోసిన మాఫియా డాన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మెడలో భారీగా బంగారు గొలుసులు వేసుకుని, నిత్యం అనుచరులను వెంటపెట్టుకుంటుని డ్రగ్స్ సరఫరా చేసిన అంగోడా లోక్క శ్రీలంక ప్రభుత్వానికి కొన్ని సంవత్సరాలు నిద్రలేకుండా చేశాడు.

భారతలో మకాం వేసిన మాఫియా డాన్
శ్రీలంక పోలీసులు అగోండా లోక్క ఆగడాలు బరించలేక అతని అంతం చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. అప్పటి ప్రభుత్వంలోని కొందరి పెద్దలతో పరిచయాలు ఉన్న అగోండా లోక్క చాకచక్యంగా శ్రీలకం నుంచి తప్పించుకుని భారతదేశం చేరుకున్నాడు. భారతదేశంలోని వివిద రాస్ట్రాలో వివిద పేర్లతో తలదాచుకున్న అగోండా లోక్క కోసం చాలా సంవత్సరాలు శ్రీలంక పోలీసులు గాలించారు.

విష ప్రయోగంతో మాఫియా డాన్ హత్య
తమిళనాడులోని కోయంబత్తూరులోని చేరన్ మానగర్ లో అంగోడా లోక్క అతని అనుచరుడు ప్రదీప్ సింగ్ సహాయంతో అగొండా లోక్క తలదాచుకున్నాడు. అగోండా లోక్కతో పాటు అతని ప్రియురాలు అమనీ తాంజీ కూడా కోయంబత్తూరులోనే ఉండేది. అయితే గత ఏడాది జులై నెలలో అగోండా లోక్కను విషం పెట్టి హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి.

మాఫియా డాన్ హత్య కేసులో అరెస్టు
కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అగోండా లోక్క శవానికి పోస్టుమార్టం నిర్వహించి మదురైలో అతని అంత్యక్రియులు పూర్తి చేశారు. గత ఏడాదిలోనే కోయంబత్తూరు పోలీసులు అగోండా లోక్కను హత్య చేశారని కేసు నమోదు చేశారు. శ్రీలంక మాఫియా అగోండా లోక్కను విషం పెట్టి చంపేశారని వెలుగు చూడటంతో కోయంబత్తూరు పోలీసులు అప్పట్లో ముగ్గురిని అరెస్టు చేశారు.

బెయిల్ మీద బయటకు
శ్రీలంక మాఫియా డాన్ అగోండా లోక్క కేసును సీబీసీఐడీకి అప్పగించారు, పోలీసులు తిరుప్పూర్ కు చెందిన శివకామసుందరి (లేడీ), తియనేశ్వరన్ లను అరెస్టు చేసి విచారణ చేసి జైలుకు పంపించారు. తరువాత శివకామసుందరి, తియనేశ్వరన్ బెయిల్ మీద బయటకు వచ్చారు, నిందితులు అమ్మానితాంజిలోని శిభిరంలో తలదాచుకున్నారని తెలిసింది.

ఎన్ కౌంటర్ లో ప్రధాన ప్రియురాలు ఔట్
అగోండా లోక్కను అప్పటి ప్రభుత్వంలోని పెద్దలు కాపాడారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. శ్రీలంక ప్రభుత్వానికి అగొండా లోక్కతో పెద్ద తలనొప్పి వచ్చింది. అగోండా లోక్క హత్యకు గురైన తరువాత శ్రీలంకలోని అతని ప్రధాన ప్రియుడు అసిత హేమతిలకను గత ఏడాదిలోనే పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపేశారు

కనపడితే కాల్చేయడమే
శ్రీలంక పోలీసులు అగోండా లోక్క అనుచరుల కోసం జల్లెడ పట్టారు. గత ఏడాది ఆగస్టులో సమిందా అనే మరో అనుచరుడిని శ్రీలంక పోలీసుల ఎన్ కౌంటర్ లో అంతం అయ్యాడు, అగోండా లోక్కా ఇద్దరు ప్రధాన అనుచరులు ఎన్ కౌంటర్ లో అంతం కావడంతో మరో నగులురు శ్రీలంక వదిలి భారత్ పారిపోవడానికి ప్రయత్నించడంతో అక్కడి పోలీసులు వారిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

ఐటీ హబ్ బెంగళూరులో కిలాడీ లేడీ మాకం
శ్రీలకం పోలీసులు ఆ దేశంలో తలదాచుకున్న అగోండా లోక్క అనుచరులను ఏరిపారేయడం మొదలు పెట్టింది, తమిళనాడులోని కోయంబత్తూరులోని సీబీసీఐడీ పోలీసులు భారతదేశంలో తలదాచుకున్న అగోండా లోక్క అనుచరుల కోసం గాలించారు. బెంగళూరులోని కళ్లప్ప సర్కిల్ సమీపంలో అగోండా లోక్క ప్రధాన అనుచరురాలు సానుక తననాయక, ఆమె అనుచరుడు గోపాలక్రిష్ణన్ తల దాచుకున్నారని పక్కా సమాచారం అందండంతో కోయంబత్తూరు సీబీసీఐడీ డీఎస్పీ శివకుమార్ ఆయన సిబ్బంది, పోలీసులు బెంగళూరు చేరుకున్నారు.

బిత్తరపోయిన మాఫియా డాన్ మాజీ ప్రియురాలు
ఆదివారం అర్దరాత్రి దాటిన తరువాత కిలాడీ లేడీ శ్రీలంకలోని అతరురగిరికి చెందిన సునాక తననాయక తలదాచుకున్న ఇంటి మీద దాడి చేసిన పోలీసులు ఆమెతో పాటు గోపాలక్రిష్ఱన్ ను అరెస్టు చేశారు. పోలీసుల ఎంట్రీతో మాఫియా డాన్ అగోండా లోక్క మాజీ ప్రియురాలు సునాక తననాయక బిత్తరపోయిందని సమాచారం. సునాక తననాయకను, గోపాలక్రిష్ణన్ ను కోయంబత్తూరు తీసుకెళ్లి న్యాయమూర్తి సంజీవి భాస్కర్ నివాసంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి సంజీవి భాస్కర్ ఆదేశాల మేరకు నిందితులు ఇద్దరిని పెరందురై సెంట్రల్ జైలుకు తరలించి విచారణ చేస్తున్నామని కోయంబత్తూరు సీబీసీఐడీ పోలీసు అధికారులు తెలిపారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications