షిండేకు ముచ్చెమటలు..గెలిచాననే ఆనందం కూడా లేకపాయె

మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించింది.. భారతీయ జనతా పార్టీ ప్రత్యేకించి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పై తన పట్టును నిరూపించుకోగలిగింది. మొత్తం 89 వార్డులను తన ఖాతాలో వేసుకోగలిగింది. బీజేపీకి ధీటుగా తడాఖా చూపింది శివసేన (ఉద్ధవ్ బాలా సాహెబ్ థాకరే) వర్గం. మిత్రపక్షం శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) 29 వార్డులకే పరిమితం కావడం ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్- 24, మజ్లిస్- 8 స్థానాలను దక్కించుకున్నాయి.

ముంబైలో పరిమితంగా వార్డులను దక్కించుకోవడం ఏక్‌నాథ్ షిండే వర్గంలో దుమారం రేపుతున్నాయి. ముంబై మేయర్ పదవికి సంబంధించిన కీలక చర్చలు ముంచుకొస్తున్న నేపథ్యంలో తన పార్టీ కార్పొరేటర్లను బీజేపీ ఎగరేసుకుపోకుండా ఏక్ నాథ్ షిండే జాగ్రత్త పడుతున్నారు. పోచింగ్ భయం పట్టుకుందాయనకు. ఈ క్రమంలో వారిని రక్షించుకోవడానికి క్యాంప్ రాజకీయాలు మొదలు పెట్టారు. శనివారం తన వర్గానికి చెందిన మొత్తం 29 మంది ఎన్నికైన ముంబై కార్పొరేటర్లను బాంద్రాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కు తరలించారు.

Kingmaker Eknath Shinde Fears BJP Poaching as He Keeps His Flock Together at a Mumbai Hotel

మేయర్ ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు అక్కడే ఉంటారు. మొత్తం 227 వార్డులకు గాను బీజేపీకి 89 సీట్లు దక్కాయి. మేయర్ పదవిని దక్కించుకోవడానికి ఇవి చాలవు. మేయర్ పదవిని సాధించాలంటే 114 వార్డులు అవసరమౌతాయి. 25 వార్డుల తక్కువ పడ్డాయి. ఈ నేపథ్యంలో- తన పార్టీకి చెందిన కార్పొరేటర్లను బీజేపీ ఎక్కడ తన్నుకు పోతుందోననే ఆందోళన షిండే వర్గంలో నెలకొంది. దీంతో వారిని ఫైవ్ స్టార్ హోటల్ కు తరలించారు.

ముంబై రాజకీయాల్లో షిండే వర్గాన్ని 'కింగ్‌మేకర్‌గా' పరిగణిస్తున్నారు. సొంతంగా మేయర్ సీటులో ఆసీనులు కావడానికి అవసరమైనంత మెజారిటీ బీజేపీకి లేకపోవడంతో చక్రం తిప్పుతున్నారు షిండే. ముంబై మేయర్ పదవిని చెరిసగం పంచుకోవాలని, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ బాడీలో కీలక పదవులు లభించాలని షిండే శివసేన ఆశిస్తోంది. దీనిపై బీజేపీ అధిష్ఠానం నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పష్టతా రాలేదు.

మరోవైపు.. పోచింగ్ వార్తలను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చుకున్నారు. షిండే వర్గానికి చెందిన కార్పొరేటర్లతో తాము ఎటువంటి మంతనాలు జరపట్లేదని, వారిని కొనుగోలు చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. షిండేతో కలిసి కూర్చుని అన్ని నిర్ణయాలను తీసుకుంటామని వ్యాఖ్యానించారు. మేయర్ ఎవరు, ఎన్ని సంవత్సరాలు ఉంటారు అనేది తామిద్దరం కలిసే నిర్ణయిస్తామని,, కార్పొరేషన్‌ను కలిసి నడుపుతామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+