వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటకలో మత విభజన-సీఎంకు కిరణ్ మజుందార్ షా హెచ్చరిక-ఐటీ రంగం నాశనమవుతందంటూ

|
Google Oneindia TeluguNews

కర్నాటకలో ఆలయ ఉత్సవాలకు ముస్లిం వ్యాపారులను దూరంగా ఉంచేందుకు హిందుత్వ గ్రూపులు చేస్తున్న ప్రయత్నాలపై భారతదేశ సాంకేతిక రాజధానిలో అలజడి కొనసాగుతోంది. దీనిపై బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో పెరుగుతున్న మతపరమైన విభజనతో టెక్, బయోటెక్‌లో దేశం యొక్క ప్రపంచ నాయకత్వం ప్రమాదంలో ఉందని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని హెచ్చరించారు.

కర్ణాటక ఎల్లప్పుడూ సమ్మిళిత ఆర్థికాభివృద్ధిని కలిగి ఉందని, ఇప్పుడు వ్యాపారులపై మతపరమైన ఆంక్షలు పెట్టడాన్ని అనుమతించకూడదన్నారు. ఐటీ, బీటీ మతపరంగా మారితే అది మన ప్రపంచ నాయకత్వాన్ని నాశనం చేస్తుందని కిరణ్ మజుందార్ షా కర్నాటక సీఎం బొమ్మైని ఓ ట్వీట్ లో హెచ్చరించారు. ఈ ట్వీట్‌లో, ఆమె బొమ్మాయిని ట్యాగ్ చేసి, "దయచేసి ఈ పెరుగుతున్న మతపరమైన విభజనను పరిష్కరించండి" అని కోరారు. మరో ట్వీట్ లో కిరణ్ మజుందార్ షా.."మా ముఖ్యమంత్రి చాలా ప్రగతిశీల నాయకుడు. ఆయన త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానని తెలిపారు.

kiran mazumdar shaw warns karnataka cm bommai, religious divison affect it leadership

తాజాగా కర్నాటకలో ముస్లిం వ్యాపారులను బ్లాక్‌లిస్ట్ చేయాలనే ప్రచారం అనేక ఆలయ పట్టణాలలో వ్యాపించింది. దీనివల్ల స్ధానిక వ్యాపారాలు ముూతపడ్డాయి. ఉత్సవాలను నిర్వహించే అనేక ఆలయ కమిటీలు ఆంక్షలపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఇవి దీర్ఘకాలిక సామాజిక సంబంధాలను దెబ్బతీశాయని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో హిజాబ్ నిషేధాన్ని హైకోర్టు సమర్థించిన తర్వాత ఆంక్షలు రావడం తాజా పరిస్దితికి అద్దం పడుతోంది. ముస్లిం వ్యాపారులు నిర్మించారని చెప్పబడుతున్న దుర్గాపరమేశ్వరి ఆలయ నిర్వహణ కమిటీ అధిపతి వ్యాఖ్యలపై ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఓ కథనం ప్రచురించింద.ఇందులో ఈ కమిటీ అధిపతి ముస్లిం వ్యాపారులను దూరంగా ఉంచాలన్న వి.హెచ్.పి.డిమాండ్‌ను తాను తిరస్కరించానని, అయితే వారు తమను తాము దూరంగా ఉండిపోయారని తెలిపారు.

English summary
biocon ltd exececutive chairperson kiran mazumdar shaw warns karnataka cm basavaraj bommai that religious division in the state will affect india's it leaderhip.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X