2024 లోక్‌సభ ఎన్నికల నాటికి అసెంబ్లీ గడువు ముగియనున్న రాష్ట్రాలివే..!

"ఒక దేశం ఒక ఎన్నిక" సాధ్యసాధ్యాలను అన్వేషించేందుకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఏర్పాటు చేయడంతో 2024 లోక్‌సభ ఎన్నికలు సాధారణంగా జరగాల్సిన సమయం కంటే ముందస్తుగా జరుగుతాయనే సంకేతాలు కేంద్రం పంపింది. తద్వారా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా లోక్‌సభ ఎన్నికలతో పాటే నిర్వహించాలనే యోచనలో కేంద్రం ఉందని తెలుస్తోంది.

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఈ కమిటీ వేసింది. 1967 వరకు లోక్‌సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితిని మళ్లీ తీసుకురావాలనే యోచనలో కేంద్రం ఉంది. ఈ క్రమంలోనే కమిటీని వేసి అలా నిర్వహిస్తే ఎలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశాలుంటాయనేదానిపై ఈ కమిటీ స్టడీ చేసి కేంద్రానికి నివేదిక ఇస్తుంది.

Know the state assemblies term that will end in and around 2024 loksabha elections

2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల సమయానికి కాస్త ముందు లేదా వెనకాల కనీసం 10 రాష్ట్రాల అసెంబ్లీల గడువు ముగుస్తుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌లలో ఈ ఏడాది చివరికల్లా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, జార్ఖండ్ రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన తాత్కాలిక ఎన్నికల షెడ్యూలు ఇలా ఉంది.

1. మిజోరం: డిసెంబర్ 2023
2. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ: జనవరి 2024 3. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం: జూన్ 2024 4. హర్యానా, మహారాష్ట్ర: నవంబర్ 2024
5. జార్ఖండ్: డిసెంబర్ 2024
6. : ఫిబ్రవరి 2025
7. బీహార్: నవంబర్ 2025
8. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్: మే 2026
9. పుదుచ్చేరి: జూన్ 2026
10.గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్: మార్చి 2027
11. ఉత్తరప్రదేశ్: మే 2027
12. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్: డిసెంబర్ 2027
13. మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర: మార్చి 2028
14. కర్ణాటక: మే 2028

కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ రద్దు పై ఎలాంటి స్పష్టత లేదు. 2018లో అక్కడ అసెంబ్లీ రద్దు అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+