ఎంపీ మిమి చక్రవర్తితో టాక్సీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన: వెంబడించి పోలీసులకు అప్పగింత

కోల్‌కతా: జాదవ్‌పూర్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సినీ నటి మిమి చక్రవర్తితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ టాక్సీ డ్రైవర్‌ను సోమవారం రాత్రి కోల్‌కతాలో పోలీసులు అరెస్ట్ చేశారు. తన కారులో ప్రయాణిస్తుండగా సదరు టాక్సీ డ్రైవర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే స్పందించారు. ఈ ఘటన హరిహయత్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఎంపీతో అసభ్యంగా టాక్సీ డ్రైవర్..

ఎంపీతో అసభ్యంగా టాక్సీ డ్రైవర్..

ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. సోమవారం మధ్యాహ్నం జిమ్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఎంపీ మిమి చక్రవర్తి కారును ఓ టాక్సీ డ్రైవర్ వెంబడించాడు. అంతేగాక, అతడు తన టాక్సీని.. ఎంపీ కారుకు సమీపంగా తీసుకువచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే, మొదట ఈ మహిళా ఎంపీ.. అతడ్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. అయినా, సదరు టాక్సీ డ్రైవర్ మళ్లీ ఎంపీ కారును ఓవర్ టేక్ చేసి మళ్లీ అసభ్యంగా ప్రవర్తించడంతో అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఈ మహిళా ఎంపీ. ఎంపీ ఫిర్యాదు మేరకు నిందితుడైన టాక్సీ డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

మహిళా ఎంపీ మిమి చక్రవర్తికి అసభ్యకర సైగలు..

మహిళా ఎంపీ మిమి చక్రవర్తికి అసభ్యకర సైగలు..


నిందితుడిని మెట్రో పాలిటన్ బైపాస్ సమీపంలోని ఆనందపూర్‌కు చెందిన లక్ష్మణ్
యాదవ్(32)గా గుర్తించారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 354, 354ఎ, 354డి, 509 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎంపీ మిమి చక్రవర్తి మాట్లాడుతూ.. ‘నా కారును ఓ టాక్సీ డ్రైవర్ వెంబడించడం గమనించాను. నేను నా కారులో ప్రయాణం చేస్తున్నాను. అయితే, టాక్సీ డ్రైవర్ నావైపు చూస్తూ అసభ్యకరంగా సైగలు చేశాడు. మొదట అది నేను పట్టించుకోకుండా ముందుకు కదిలాను. కానీ, అతడు నా కారును అతివేగంగా ఓవర్ టేక్ చేసి మళ్లీ నాతో అసభ్యకరంగా సైగలు చేశాడు' అని వెల్లడించారు.

అందుకే వెంబడించి పట్టుకున్నా..

అందుకే వెంబడించి పట్టుకున్నా..


‘ఈ క్రమంలో అతడ్ని వదిలివేయకూడదని అనుకున్నా. అతడిని వదిలిస్తే అతడి టాక్సీలో ప్రయాణించే మహిళలకు కూడా రక్షణ ఉండదని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాను. అతడి కారును వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించాను' అని మిమి చక్రవర్తి తెలిపారు. కాగా, మిమి చక్రవర్తి ఓ వైపు ఎంపీగా కొనసాగుతూనే పలు టీవీ షోల్లో కనిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+