‘కుక్కలే నయం’: పాక్, ఐఎస్ఐపై రగిలిపోతున్న పీవోకే
ముజఫరాబాద్: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని ప్రజలు మరోసారి పాకిస్థాన్ దురాగతాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసన ప్రదర్శలు చేపట్టారు. పాకిస్థాన్ సైన్యం, ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ పాల్పడుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు.
పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా గళమెత్తుతున్న కాశ్మీర్ ఆజాదీ నేతల బూటకపు ఎన్‌కౌంటర్లు, అక్రమ హత్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ఆర్మీ, ఐఎస్‌ఐ కూడబల్కుకొని ఈ హత్యలు చేస్తున్నాయంటూ పీవోకేలోని కోటిల్ వాసులు ఇటీవల నిర్వహించిన ఈ భారీ ఆందోళనకు సంబంధించిన వీడియోలు బహిర్గతమయ్యాయి.

'కాశ్మీర్‌ను ముక్కలు చేసిన కసాయి పాకిస్థాన్ ఆర్మీ'... 'ఐఎస్‌ఐ కన్నా కుక్కలు విధేయంగా ఉంటాయి' అంటూ ఈ సందర్భంగా ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాశ్మీరీ జాతీయవాద ప్రధాన నేత ఆరిఫ్ షాహిద్ హత్యపై స్వతంత్ర దర్యాప్తు జరుపాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
అఖిలపక్ష జాతీయ కూటమి (ఏపీఎన్‌ఏ) ఛైర్మన్, జమ్మూకాశ్మీర్ జాతీయ విముక్తి కాన్ఫరెన్స్ (జేకేఎన్‌ఎల్సీ) అధ్యక్షుడు అయిన 60 ఏళ్ల షాహిద్ 2013 మే 14న రావాల్పిండిలో తన ఇంటి ఎదుట హత్యకు గురయ్యారు. పీవోకేలో పాక్ అణచివేతను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయనను ఐఎస్‌ఐ కుట్రపూరితంగా చంపిందనే ఆరోపణలు ఉన్నాయి.
ముజఫరాబాద్‌లోని అఖిలప జాతీయ కూటమి లెక్కల ప్రకారం దాదాపు వందమంది కాశ్మీర్ ఆజాదీ అనుకూల రాజకీయ కార్యకర్తలను పాక్ కిరాతకంగా హతమార్చిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీవోకేలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications