ఏపీలో నీటి ఎద్దడి.. తెలంగాణలో జలసిరులు... రివర్ బోర్డు లేఖ
వేసవి ప్రభావం కనిపిస్తోంది. తాగునీటి కష్టాలు కళ్లముందే ఉన్నాయి. పొరుగు రాష్ట్రం ఏఫీలో ఎక్కువ ఉంది. గతేడాది కూడా తాగునీటి కోసం నీరు అడగగా భగీరథుడు కేసీఆర్ అందజేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఏపీ రంగంలోకి దిగలేదు. కృష్ణా రివర్ బోర్డు ద్వారా అడిగించింది.

రివర్ బోర్డు..
ఏపీ తాగునీటి అవసరాల కోసం అక్కడి ప్రభుత్వం స్పందించలేదు. తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా వాటర్ రివర్ బోర్డు లేఖ రాసింది. తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయాలని పేర్కొంది. తాగునీరు కావాలని ఏపీ కోరుతోందని ఆ లేఖలో పేర్కొంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఏపీ కోటా ఇప్పటికే పూర్తయిందని కృష్ణా బోర్డు తెలిపింది. కానీ అవసరాల దృష్ట్యా విడుదల చేయాలని సూచించింది.

7 టీఎంసీలు కావాలట..
వేసవి దృష్ట్యా తాగునీటి అవసరాల కోసం 6 నుంచి 7 టీఎంసీలు విడుదల చేయాలని ఏపీ అడుగుతుందని కృష్ణా బోర్డు పేర్కొంది. అయితే ఇదీ పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినతిపై వైఖరి స్పష్టం చేయాలని తెలంగాణను కృష్ణా బోర్డు కోరింది. గతేడాది కూడా ఏపీ తాగునీటి అవసరాలకు ఇబ్బంది పడింది. ఆ సమయంలో సీఎం జగన్, కేసీఆర్‌ను అడగగా స్పందించారు. 2 టీఎంసీల నీటిని ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు.

ఏపీలో నీటి ఎద్దడి
మరీ ఈ సారి ఏం చేస్తారో చూడాలీ మరీ. దిగువన ఉన్న ఏపీ నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. కానీ కాస్త ఎగువన ఉన్న తెలంగాణ సస్యశ్యామలంగా ఉంది. ఇటీవల ప్రాజెక్టు పని పూర్తి కావడంతో నీరు పొంగిన సంగతి తెలిసిందే. వేసవిలో కూడా తెలంగాణలో జల సిరులు కురుస్తుంటో ఏపీలో మాత్రం ఆ ఊసే లేదు. పక్క
రాష్ట్రంపై ఆధారపడుతోంది. గతేడాది జగన్ రంగంలోకి దిగగా.. ఈ సారి రివర్ బోర్డు ద్వారా అడిగించారు. మరీ కేసీఆర్ ఏం ఆన్సర్ ఇస్తారో చూడాలీ.












Click it and Unblock the Notifications