Lady leader: భార్య మేయర్ అభ్యర్థి, భార్యను రివాల్వర్ తో కాల్చి చంపి ఆత్మహత్య చేసుకున్న టాప్ లీడర్ !

పాట్నా/బీహార్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. మొదటి నుంచి భర్త రాజకీయాల్లో ఉంటున్నాడు. భర్తకు తోడుగా ఇంట్లోనే కాకుండా బయటకూడా రాజకీయాల్లో అతని భార్య చురుకుగా ఉంటోంది. భార్యకూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండటంతో భర్త ఆ నగరంలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మేయర్ అభ్యర్థిగా భార్యను బరిలోకి దింపిన భర్త ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టాడు. తన అనుచరులతో కలిసి భర్త ఎన్నికల కోసం ప్రచారం ముమ్మరం చేశాడు. పొలం దగ్గరకు వెళ్లిన భర్త తరువాత ఇంటికి వెళ్లాడు. ఇంట్లో పెంచుకుంటున్న సొంత గుర్రానికి గడ్డి వేసిన తరువాత బీజేపీ నాయకుడు ఓ రూమ్ లోకి వెళ్లాడు. అక్కడ భార్యతో గొడవపడిన భర్త రివాల్వర్ తీసుకుని ఆమెను కాల్చి చంపేశాడు. భార్య చనిపోయిందని నిర్దారించుకున్న బీజేపీ నాయకుడు అదే రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మేయర్ అభ్యర్థి అయిన నాయకురాలు భర్త చేతిలో హత్యకు గురికావడం, భర్త కూడా ఆత్మహత్య చేసుకోవడం ఆ నగరంలో కలకలం రేపింది.

బీజేపీ నాయకుడు

బీజేపీ నాయకుడు

బీహార్ లోని ముంగేర్ జిల్లా ఓబీసీ మోర్చా విభాగం ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న అరుణ్ యాదవ్ అలియాస్ అరుణ్ భయ్యా (40) బీజేపీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముంగేర్ నగరంలో ఓబీసీ నాయకుల్లో అరుణ్ యాదవ్ కు మంచి గుర్తింపు ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం అరుణ్ యాదవ్ ప్రీతి యాదవ్ అలియాస్ ప్రీతి (35)ని పెళ్లి చేసుకున్నాడు.

ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్న భార్య

ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్న భార్య

వివాహం చేసుకున్న అరుణ్ యాదవ్, ప్రీతి యాదవ్ దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. మొదటి నుంచి అరుణ్ యాదవ్, అతని ముగ్గురు సోదరులు రాజకీయాల్లో ఉంటున్నారు. భర్త అరుణ్ యాదవ్ కు తోడుగా రాజకీయాల్లో అతని భార్య ప్రతీ యాదవ్ చురుకుగా ఉంటోంది. భార్య ప్రీతి యాదవ్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండటంతో అరుణ్ యాదవ్ ముంగేర్ నగరంలో మంచి పలుకుబడి ఉన్న లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

భార్య మేయర్ అభ్యర్థి

భార్య మేయర్ అభ్యర్థి


ముంగేర్ మేయర్ అభ్యర్థిగా మహిళకు రిజర్వేషన్ కేటాయించారు. ముంగేర్ మేయర్ బీజేపీ అభ్యర్థిగా ప్రీతి యాదవ్ పేరు ఖరారు అయ్యింది. మేయర్ అభ్యర్థిగా భార్య ప్రీతి యాదవ్ ను బరిలోకి దింపిన ఆమె భర్త అరుణ్ యాదవ్ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టాడు. తన సోదరులు, అనుచరులతో కలిసి అరుణ్ యాదవ్ అతని భార్య ప్రతీ యాదవ్ తరుపున ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాడు.

 భార్యను కాల్చి చంపేసిన బీజేపీ లీడర్

భార్యను కాల్చి చంపేసిన బీజేపీ లీడర్


పొలం దగ్గరకు వెళ్లిన బీజేపీ నాయకుడు అరుణ్ యాదవ్ కొన్ని గంటలు అక్కడే ఉన్నాడు. తరువాత అరుణ్ యాదవ్ ముంగేర్ నగరంలోని లాల్ దర్వాజా సెంటర్ లోని ఇంటికి వెళ్లాడు. ఇంట్లో పెంచుకుంటున్న సొంత గుర్రానికి గడ్డి వేసిన తరువాత బీజేపీ నాయకుడు అరుణ్ యాదవ్ ఓ రూమ్ లోకి వెళ్లాడు. అక్కడ భార్య ప్రీతి యాదవ్ తో గొడవపడిన అరుణ్ యాదవ్ అతని రివాల్వర్ తో ఆమెను కాల్చి చంపేశాడు.

 భార్యను చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడు

భార్యను చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడు

భార్య ప్రతీ యాదవ్ చనిపోయిందని నిర్దారించుకున్న బీజేపీ నాయకుడు అరుణ్ యాదవ్ అదే రివాల్వర్ తో భార్య శవం పక్కనే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మేయర్ అభ్యర్థి ప్రీతి యాదవ్ ఆమె భర్త అరుణ్ యాదవ్ చేతిలో హత్యకు గురికావడం, అరుణ్ యాదవ్ కూడా ఆత్మహత్య చేసుకోవడం ముంగేర్ నగరంలో కలకలం రేపింది.

 లీడర్ రివాల్వర్ కు ప్రభుత్వ లైసెన్స్

లీడర్ రివాల్వర్ కు ప్రభుత్వ లైసెన్స్

భార్య ప్రీతి యాదవ్ ను కాల్చి చంపేసిన అరుణ్ యాదవ్ అతను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించిన రివాల్వర్ కు లైసెన్స్ ఉందని, కేసు విచారణలో ఉందని సీనియర్ పోలీసు అధికారి కే. పాండే స్థానిక మీడియాకు చెప్పారు. ఎన్నికల ప్రచారం చేసే విషయంలో అరుణ్ యాదవ్, ప్రీతి యాదవ్ దంపతుల మద్య గొడవ జరిగిందని, అదే ఇద్దరి ప్రాణం పోవడానికి దారితీసి ఉంటుందని పోలీసు అధికారులు, బీజేపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+