Lady leader: భార్య గొంతు చీల్చి చంపేసి విషం తాగిన భర్త, అధ్యక్షుడి ఎన్నికల్లో, దెబ్బకు రివర్స్ !
బెంగళూరు/మంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.భర్త రాజకీయాల్లో ఉన్నాడు. ఈసారి భార్యను గ్రామ పంచాయితీ సభ్యురాలిగా గెలిపించుకున్న భర్త ఆ ఊరిలో పెత్తనం చెలాయిస్తున్నాడు. గ్రామ పంచాయితీ అధ్యక్షుడి ఎన్నికల సందర్బంగా దంపతుల మద్య తేడాలు వచ్చాయి. భర్త ఒకరికి ఓటు వెయ్యమంటే భార్య మరో వ్యక్తికి ఓటు వేసింది. భార్య దెబ్బతో గ్రామ పంచాయితీ అధ్యక్షుడి ఎన్నికలు తారుమారు అయ్యాయి. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు తారాస్థాయికి చేరాయి. చివరికి గ్రామ పంచాయితీ సభ్యురాలి గొంతు కోసి దారుణంగా హత్య చేసిన భర్త విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. రాజకీయాల గొడవలతో లేడీ లీడర్ ను ఆమె భర్త దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

రాజకీయాల్లో దంపతులు
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని కారవార సమీపంలోని ముండగోడ ప్రాంతంలో బసవరాజ్, అంకమ్మ అలియాస్ కమలమ్మ (45) దంపతులు నివాసం ఉంటున్నారు. 20 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న కమలమ్మ, బసవరాజ్ దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. బసవరాజ్, కమలమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

లేడీ లీడర్
బసవరాజ్ రాజకీయాల్లో ఉన్నాడు. ఈసారి భార్య కమలమ్మను గ్రామ పంచాయితీ సభ్యురాలిగా గెలిపించుకున్న బసవరాజ్ రాజకీయంగా ఆ ప్రాంతంలో పెత్తనం చెలాయిస్తున్నాడు. భర్త బసవరాజ్ అన్ని చూసుకుంటుంటే కమలమ్మ ఆమె పని ఆమె చేసుకుంటూ వెలుతోంది. గ్రామ పంచాయితీ అధ్యక్షుడి మీద అవిశ్వా తీర్మాణం ప్రవేశ పెట్టడంతో ఆ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో వేడిపుట్టింది.

భర్త ఒకరికి ఓటు వెయ్యమంటే భార్య ?
గ్రామ పంచాయితీ అధ్యక్షుడి ఎన్నికల సందర్బంగా బసవరాజ్, కమలమ్మ దంపతుల మద్య తేడాలు వచ్చాయి. బసవరాజ్ ఒకరికి ఓటు వెయ్యమంటే ఆయన భార్య కమలమ్మ మరో వ్యక్తికి ఓటు వేసింది. కమలమ్మ దెబ్బతో గ్రామ పంచాయితీ అధ్యక్షుడి ఎన్నికలు తారుమారు కావడం, మరో వ్యక్తి అధ్యక్షుడిగా విజయం సాధించడంతో అందరూ హడలిపోయారు.

భార్య గొంతు చీల్చి హత్య చేసిన భర్త
గ్రామ పంచాయితీ అధ్యక్షుడి ఎన్నికల విషయంలో కమలమ్మ, బసవరాజ్ దంపతుల మద్య గొడవలు తారాస్థాయికి చేరాయి. చివరికి గ్రామ పంచాయితీ సభ్యురాలు కమలమ్మను చితకబాదిన ఆమె భర్త బసవరాజ్ ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. కమలమ్మను రక్షించడానికి స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. భర్త కమలమ్మను హత్య చేసిన ఆమె భర్త బసవరాజ్ విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఐసీయూలో భర్త
తీవ్రఅస్వస్థతకు గురైన బసవరాజ్ ను కిమ్స్ ఆసుపత్రికి తరించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని పోలీసులు అన్నారు. కమలమ్మ మరో వ్యక్తికి ఓటు వెయ్యడంతో గ్రామ పంచాయితీ అధ్యక్షుడిగా వేరే వ్యక్తి విజయం సాధించారని, ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు జరిగాయని రాజకీయంగా గొడవలు జరగడంతో లేడీ లీడర్ కమలమ్మను ఆమె భర్త బసవరాజ్ దారుణంగా హత్య చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది












Click it and Unblock the Notifications