Lady: మద్యం మత్తులో వెళ్లి ఫ్రీగా సిగరెట్ అడిగాడు, లేదని చెప్పిన లేడీని నరికి చంపేసిన కాంట్రాక్టర్ !
న్యూఢిల్లీ: పబ్లింగ్ కాంట్రాక్టు పనులు చేస్తున్న ఓ వ్యక్తి రాత్రి తప్పతాగి ఓ దుకాణం దగ్గరకు వెళ్లాడు. మందులోకి మంచింగ్ కోసం కారం కారంగా ఉండే ఆహార పదార్థాలతో పాటు సిగరెట్ ఇవ్వాలని దుకాణంలో ఉన్న మహిళను అడిగాడు. సిగరెట్ కు తన దగ్గర డబ్బులు లేవని, అకౌంట్ లో రాసుకోవాలని కాంట్రాక్టర్ చెప్పాడు. షాపులో నా భర్త లేడు, మీరు ఎవరో నాకు తెలీదు, నేను అప్పు ఇవ్వను అని ఆమె చెప్పింది. ఆ సమయంలో దుకాణం యజమానురాలికి, కాంట్రాక్టర్ ల మద్య మాటామాటా పెరిగిపోయింది.
కాంట్రాక్టర్ ను అక్కడి నుంచి బెదిరించి పంపించాలని ప్రయత్నించిన ఆమె షాపులో ఉన్న చీపిరి (పరక) తీసుకుని అతనికి చూపించింది. ఆ సమయంలో రెచ్చిపోయిన కాంట్రాక్టర్ టూల్ బాక్స్ లోని పదునైన ఆయుధం తీసుకుని ఆమె మెడ మీద దారుణంగా దాడి చెయ్యడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మహిళ మీద దాడి చేసిన కాంట్రాక్టర్ ను పట్టుకున్న స్థానికులు అతన్ని చావబాదేయడంతో అతనికి తీవ్రగాయాలైనాయి. పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన సమయంలో స్థానికులు పోలీసుల మీద రాళ్లతో దాడి చెయ్యడం, పోలీసులకు గాయాలు కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దేశ రాజధానిలో దంపతుల షాపు
దేశరాజధాని ఢిల్లీలోని దాబ్రి ప్రాంతంలో నివాసం ఉంటున్న విభా (30) అనే మహిళ ఆమె భర్తతో కలిసి ద్వారక ప్రాంతంలో ఓ చిల్లర దుకాణం నిర్వహిస్తున్నది. ప్రతిరోజూ విభా దంపతులు ఉదయం నుంచి రాత్రి వరకు షాపులో వ్యాపారం చేస్తున్నారు. షాపులో వ్యాపారం చేస్తున్న దంపతులు వారి కుటుంబాన్ని నెట్టుకువస్తున్నారు.

తప్పతాగి వెళ్లిన కాంట్రాక్టర్
ఢిల్లీలో దిలీప్ అనే వ్యక్తి నివాసం ఉంటూ పబ్లింగ్ కాంట్రాక్టు పనులు చేస్తున్నాడు. పబ్లింగ్ కాంట్రాక్టు పనులు చేస్తున్న దిలీప్ రాత్రి 10.45 గంటల సమయంలో తప్పతాగి విభా దుకాణం దగ్గరకు వెళ్లాడు. మందులోకి మంచింగ్ కోసం కారం కారంగా ఉండే ఆహార పదార్థాలతో పాటు సిగరెట్ ఇవ్వాలని దుకాణంలో ఉన్న విభాను అడిగాడు.

అకౌంట్ లో రాసుకోవాలని చెప్పాడు
సిగరెట్ కు తన దగ్గర డబ్బులు లేవని, అకౌంట్ లో రాసుకోవాలని కాంట్రాక్టర్ దిలీప్ ఆమెకు చెప్పాడు. షాపులో నా భర్త లేడు, మీరు ఎవరో నాకు తెలీదు, నేను అప్పు ఇవ్వను అని విభా తేల్చిచెప్పింది. ఆ సమయంలో దుకాణం యజమానురాలు విభాకు, కాంట్రాక్టర్ దిలీప్ ల మద్య మాటామాటా పెరిగిపోయింది.

చీపురు చూపించింది...... కోపంతో ఆమె మెడ నరికేశాడు
మద్యం మత్తులో దిలీప్ అక్కడ రెచ్చిపోవడంతో విభా సహనం కోల్పోయింది. కాంట్రాక్టర్ దిలీప్ ను అక్కడి నుంచి బెదిరించి పంపించాలని ప్రయత్నించిన విభా షాపులో ఉన్న చీపిరి (పరక) తీసుకుని దిలీప్ కు చూపించి ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్లిపోవాలని చెప్పింది. ఆ సమయంలో రెచ్చిపోయిన కాంట్రాక్టర్ దిలీప్ టూల్ బాక్స్ లోని పదునైన ఆయుధం తీసుకుని విభా మెడ మీద దాడి చేశాడు.
Recommended Video

మహిళ ప్రాణం పోయింది.... కాంట్రాక్టర్ ను చావబాదిన స్థానికులు
మెడ తెగిపోవడంతో విభాను వెంటనే డీడీయు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విభా ప్రాణం పోయిందని పోలీసులు అన్నారు. విభా మీద దాడి చేసిన దిలీప్ పారిపోవడానికి ప్రయత్నించారు. మహిళ మీద దాడి చేసిన కాంట్రాక్టర్ ను పట్టుకున్న స్థానికులు అతన్ని చావబాదేయడంతో అతనికి తీవ్రగాయాలైనాయి. పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన సమయంలో స్థానికులు పోలీసుల మీద రాళ్లతో దాడి చెయ్యడం, పోలీసులకు గాయాలు కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications