వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lady police: యూనీఫామ్ బెల్ట్ తో భార్యను చంపిన భర్త, సీబీసీఐడికి కేసు అప్పగించాలని హైకోర్టులో !

|
Google Oneindia TeluguNews

చెన్నై/మదురై: లేడీ హెడ్ కానిస్టేబుల్ హత్య కేసులో పిటిషన్ దాఖలు చెయ్యాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. యూనీఫామ్ బెల్ట్ తోనే తన కూతురిని ఆమె భర్త హత్య చేశాడని, ఈ కేసులో స్థానిక పోలీసులు ఇంకా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని, కేసు సీబీ-సీఐడీకి అప్పగించాలని హత్యకు గురైన లేడీ హెడ్ కానిస్టేబుల్ తండ్రి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణ చేసిన మద్రాసు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ గా పిటిషన్ దాఖలు చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత లేడీ హెడ్ కానిస్టేబుల్ భార్య మీద అనుమానం పెంచుకున్న ఆమె భర్త ఇంట్లోనే హత్య చేశాడని కేసు నమోదు అయ్యింది.

Illegal affair: ఇంట్లో భర్త శవం పెట్టుకుని ప్రియుడితో ఎంజాయ్ చేసిన ఆంటీ, కామపిచాచి క్లోజ్ !Illegal affair: ఇంట్లో భర్త శవం పెట్టుకుని ప్రియుడితో ఎంజాయ్ చేసిన ఆంటీ, కామపిచాచి క్లోజ్ !

లేడీ హెడ్ కానిస్టేబుల్

లేడీ హెడ్ కానిస్టేబుల్

తమిళనాడు పోలీసు శాఖలో భానుప్రియా (30) అనే యువతి హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నది. మదురైకి చెందిన విఘ్నేష్ అనే యువకుడు ఆర్ టీసీలో (టీఎన్ఎస్ టీసీ) కండెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మంచి ఉద్యోగాలు చేస్తున్న భానుప్రియా, విఘ్నేష్ పెళ్లి చేస్తే జీవితాంతం సంతోషంగా ఉంటారని, వారికి పుట్టబోయే పిల్లలను బాగా చదివించుకున్నారని ఇద్దరి కుటుంబ సభ్యులు అనుకున్నారు. లేడీ పోలీసు భానుప్రియాతో కండెక్టర్ విఘ్నేష్ ల వివాహం 2016లో జరిగింది.

నాలుగు సంవత్సరాలు ఓకే

నాలుగు సంవత్సరాలు ఓకే

మంచి ఉద్యోగాలు చేస్తున్న భానుప్రియా, విఘ్నేష్ చక్కగా కాపురం చేసుకుంటున్నారు. విఘ్నేష్, భానుప్రియా దంపతులకు నాలుగు సంవత్సరాల వయసు ఉన్న కుమార్తె, రెండు సంవత్సరాల వయసు ఉన్న ఓ కుమారుడు ఉన్నాడు. ఇద్దరు పిల్లలతో కలిసి భానుప్రియా, విఘ్నేష్ దంపతులు సంతోషంగా ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు.

 పోలీసు పెళ్లామ్ మీద అనుమానం

పోలీసు పెళ్లామ్ మీద అనుమానం


భానుప్రియా విరూద్ నగర్ పశ్చిమ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నది. విఘ్నేష్, భానుప్రియా దంపతులు విరూద్ నగర్ లోని కులకురై ప్రాంతంలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. పిల్లలతో కలిసి సంతోషంగా జీవనం సాగిస్తున్న భానుప్రియా, విఘ్నేష్ దంపతుల మద్య కొంతకాలం క్రితం సమస్యలు మొదలైనాయి. భార్య భానుప్రియా తీరుతో ఆమె భర్త విఘ్నేష్ కు అనుమానం మొదలైయ్యిందని సమాచారం.

 భర్త ఒకటి చెబితే..... భార్య రెండు చెప్పింది

భర్త ఒకటి చెబితే..... భార్య రెండు చెప్పింది

ప్రతిరోజూ ఇంట్లో భానుప్రియా, విఘ్నేష్ దంపతులు వారి పిల్లల ముందే గొడవ పడుతున్నారు. రోజూ ఏంది ఈ పంచాయితీ, విరూద్ నగర్ లోని ఇంటిని, ఈ ఊరిని మార్చేస్తే ధరిద్రం పోతుందని భర్త విఘ్నేష్ అనుకున్నాడు. విరూద్ నగర్ ఊరిని వదిలి మదురైకి వెళ్లిపోదామని భర్త లేడీ పోలీసు భానుప్రియాకు చెప్పాడు. ఇక్క అప్పటి నుంచి గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి. అయితే విరూద్ నగర్ ను మాత్రం వదిలి నేను ఎక్కడికి రానని భానుప్రియా ఆమె భర్త విఘ్నేష్ కు తేల్చి చెప్పింది.

యూనీఫామ్ బెల్ట్ తో చంపేసిన భర్త

యూనీఫామ్ బెల్ట్ తో చంపేసిన భర్త

నేను చచ్చినా నేను విరూద్ నగర్ ఊరును, ఈ ఇల్లు వదిలి నేను రానని భార్య భానుప్రియా మొండికి వేసింది. ఆగస్టు 20వ తేదీ రాత్రి 10.30 గంటల సమయంలో ఇదే విషయంలో పెద్దగా గొడవ జరిగింది. ఆ సమయంలో విఘ్నేష్ సహనం కోల్పోయాడు. అయితే నువ్వు నిజంగానే చచ్చిపో అంటూ లేడీ పోలీసు భానుప్రియా గొంతును ఆమె పోలీసు యూనీఫామ్ బెల్ట్ తో బిగించిన విఘ్నేష్ ఆమెను హత్య చెయ్యడం కలకలం రేపింది. ఊరును, ఇంటిని మార్చే విషయంలో జరిగిన గొడవలో లేడీ పోలీసు భార్య భానుప్రియా దారుణ హత్యకు గురి కావడం అప్పట్లో తమిళనాడులో కలకలం రేపింది.

హైకోర్టును ఆశ్రయించిన తండ్రి

హైకోర్టును ఆశ్రయించిన తండ్రి

తన కూతురు భానుప్రియను ఆహె భర్త విఘ్నేష్ హత్య చేసినా స్థానిక పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని ఆమె తండ్రి ఆర్. చంద్రశేఖర్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కూతురు భానుప్రియా ఆత్మహత్య శాంతించాలంటే తన అల్లుడు విఘ్నేష్ ను జీవితాంతం జైల్లో పెట్టాలని ఆమె తండ్రి చంద్రశేఖర్ కోర్టులో మనవి చేశారు.

 రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

మంగళవారం మద్రాసు హైకోర్టు భానుప్రియా తండ్రి దాఖలు చేసిన పిటిషన్ విచారణ చేసింది. లేడీ హెడ్ కానిస్టేబుల్ భానుప్రియ హత్య కేసులో కౌంటర్ పిటిషన్ దాఖలు చెయ్యాలని మద్రాసు హైకోర్టు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. యూనీఫామ్ బెల్ట్ తోనే తన కూతురిని ఆమె భర్త హత్య చేశాడని, ఈ కేసులో స్థానిక పోలీసులు ఇంకా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని, కేసు సీబీ-సీఐడీకి అప్పగించాలని హత్యకు గురైన లేడీ హెడ్ కానిస్టేబుల్ తండ్రి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 సీబీసీఐడీకి కేసు అప్పగించాలని మనవి

సీబీసీఐడీకి కేసు అప్పగించాలని మనవి

భానుపత్రియా తండ్రి సమర్పించిన పిటిషన్ విచారణను మద్రాసు హైకోర్టు ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది. మద్రాసు హైకోర్టు తరాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ గా పిటిషన్ దాఖలు చెయ్యాలని ఆదేశాలు జారీ చెయ్యడంతో స్థానిక పోలీసులు ఇప్పుడు అలర్ట్ అయ్యారని తెలిసింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత లేడీ హెడ్ కానిస్టేబుల్ భానుప్రియా మీద మీద అనుమానం పెంచుకున్న ఆమె భర్త విఘ్నేష్ నెల క్రితం ఆమెను ఇంట్లోనే హత్య చేశాడని ఇప్పటికే కేసు నమోదు అయ్యింది.

English summary
Lady police murder case: The Madras high court on Tuesday sought a response from the state government on a plea which sought CB-CID probe into the murder of a woman head constable by her husband over a family dispute in August.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X