వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lady techie:అమెరికాలో భార్య, కొత్త మొగుడి కోసం ప్రకటన ఇచ్చిన భర్త, అసలు మ్యాటర్ తెలిసి షాక్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/తిరువవళ్లూరు: సాఫ్ట్ వేర్ ఇంజనీరు అయిన యువతికి వివాహం చెయ్యాలని పెద్దలు నిశ్చయించారు. బుద్దిమంతుడు, ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువకుడు అని కొందరు చెప్పడంతో ఆమె వివాహం అతనితోనే నిశ్చయం అయ్యింది. పెద్దల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి జరిగింది. భార్యకు అమెరికాలో ఉద్యోగం రావడంతో ఆమె వెంటన భర్త ఎగరేసుకుంటూ అమెరికా వెళ్లాడు. దంపతులకు ఓ పాప ఉంది. ఉద్యోగం లేకుండా ఖాలీగా ఉంటున్న భర్త అమెరికాలో కూతురిని చూసుకుంటూ కొంతకాలం గడిపేశాడు. అదే సమయంలో అమెరికాలోనే దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. మూడు సంవత్సరాల నుంచి అమెరికాలో దంపతులు వేర్వేరుగా నివాసం ఉంటున్నాడు. భార్య, కూతురిని అమెరికాలో వదిలేసి సొంతఊరు వచ్చిన భర్త విడాకులు కావాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. విడాకుల కేసు కోర్టులో ఇంకా పెండింగ్ లో ఉంది. ఇదే సమయంలో అమెరికాలో ఉన్న టెక్కీ భార్యకు వరుడు కావలెను అంటూ ఫేమస్ మ్యాట్రీమోనీలో ఓ ప్రకటన ప్రత్యక్షం అయ్యింది. ఆ ప్రకటన చూసిన చాలా మంది అమెరికా భార్యను సొంతం చేసుకోవాలని రోజుకు సుమారు 100 మంది ఆమె తండ్రికి ఫోన్ చెయ్యడం మొదలుపెట్టారు. నా కూతురికి ఇంకా విడాకులు రాలేదని, అసలు మేము ఆ ప్రకటన ఇవ్వలేదని ఆమె తండ్రి ఫోన్లు చేస్తున్న అందరికీ చెప్పుకుంటూ వచ్చాడు. ప్రతిరోజూ వందల సంఖ్యలో నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటూ ఆమె తండ్రికి ఫోన్లు చేసి వేదిచారు. లేడీ టెక్కీ భార్య పోలీసు కేసు పెట్టారు. మ్యాట్రీమోనీలో ప్రకటన ఇచ్చింది ఎవరూ అని ఆరా తీసిన పోలీసులు అసలు మ్యాటర్ తెలుసుకుని బిత్తరపోయారు.

Lady: ఇంట్లో మొగుడు, ఫేస్ బుక్ లో ప్రియుడు, సీక్రేట్ ఎంజాయ్, సీన్ రివర్స్ తో ఆసుపత్రిలో ఆత్మహత్య !Lady: ఇంట్లో మొగుడు, ఫేస్ బుక్ లో ప్రియుడు, సీక్రేట్ ఎంజాయ్, సీన్ రివర్స్ తో ఆసుపత్రిలో ఆత్మహత్య !

అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజనీరు

అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజనీరు


తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలోని కదంత్తూరులోని యూనియన్ ఏరియాలో పద్మనాభం అనే ఆయన నివాసం ఉంటున్నారు. పద్మనాభం కుమార్తె ఝాన్సీ (32) అనే కుమార్తె ఉంది. ఝాన్సీ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నది. తిరువళ్లూరు సమీపంలోని వెల్లియూర్ గ్రామంలో ఓంకుమార్ (34) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు.

ఐదు సంవత్సరాల క్రితం గ్రాండ్ గా పెళ్లి

ఐదు సంవత్సరాల క్రితం గ్రాండ్ గా పెళ్లి

సాఫ్ట్ వేర్ ఇంజనీరు అయిన ఝాన్సీకి వివాహం చెయ్యాలని ఆమె పెద్దలు నిశ్చయించారు. బుద్దిమంతుడు, ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువకుడు ఓంకుమార్ అయితే బాగుంటుందని కొందరు చెప్పడంతో ఝాన్సీ వివాహం అతనితోనే నిశ్చయం అయ్యింది. పెద్దల సమక్షంలో ఐదు సంవత్సరాల క్రితం ఓంకుమార్, ఝాన్సీల వివాహం తిరువళ్లూరులో చాలా గ్రాండ్ గా పెళ్లి జరిగింది.

అమెరికాలో భార్యకు ఉద్యోగం

అమెరికాలో భార్యకు ఉద్యోగం


వివాహం జరిగిన తరువాత ఝాన్సీకి అమెరికాలో మంచి ఉద్యోగం వచ్చింది. భార్య ఝాన్సీకి అమెరికాలో ఉద్యోగం రావడంతో ఆమె వెంట భర్త ఓంకుమార్ ఎగరేసుకుంటూ అమెరికా వెళ్లాడు. ఓంకుమార్, ఝాన్సీ దంపతులకు మూడున్నర సంవత్సరాల వయసు ఉన్న ఓ పాప ఉంది. ఉద్యోగం చెయ్యకుండా ఖాలీగా ఉంటున్న ఓంకుమార్ అమెరికాలో అతని కూతురిని చూసుకుంటూ కొంతకాలం గడిపేశాడు. ఝాన్సీ ఉద్యోగం చేస్తూ భర్త ఓంకుమార్, కుమార్తెను పోషించుకుంటూ వచ్చింది.

అమెరికాలో భార్య, కూతురిని వదిలేసి వచ్చేశాడు

అమెరికాలో భార్య, కూతురిని వదిలేసి వచ్చేశాడు

అమెరికాలోనే ఓంకుమార్, ఝాన్సీ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. మూడు సంవత్సరాల నుంచి అమెరికాలో ఓంకుమార్, ఝాన్సీ దంపతులు వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. భార్య ఝాన్సీ, కూతురిని అమెరికాలో వదిలేసిన ఓంకుమార్ తమిళనాడులోని సొంతఊరు వచ్చేశాడు. తనకు విడాకులు కావాలని ఓంకుమార్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఝాన్సీ కూడా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఓంకుమార్, ఝాన్సీల విడాకుల కేసు కోర్టులో ఇంకా పెండింగ్ లో ఉంది.

భార్య మీద పగతో ఏం చేశాడంటే ?

భార్య మీద పగతో ఏం చేశాడంటే ?


తనతో విడాకులు తీసుకుంటున్న తన భార్య ఝాన్సీ జీవితంతో ఆడుకోవాలని ఆమె భర్త ఓంకుమార్ స్కెచ్ వేశాడు. భార్య ఝాన్సీ మీద పగ తీర్చుకోవాలని స్కెచ్ వేసిన ఓంకుమార్ కు ఓ క్రిమినల్ ఐడియా వచ్చింది. ఓ ఫేమస్ మ్యాట్రీమోనీ వెబ్ సైట్ లో భార్య ఝాన్సీ ఫోటో, ఆమె పూర్తి సమాచారం పెట్టిన ఓంకుమార్ తనకు వరుడు కావలను అని ప్రకటన ఇచ్చింది కింద సంప్రధించవలసిన ఫోన్ నెంబర్ అంటూ ఆమె తండ్రి పద్మనాభం మొబైల్ ఫోన్ నెంబర్ తగిలించాడు.

 రోజుకు 100 ఫోన్లు.... విసిగిపోయిన మామ

రోజుకు 100 ఫోన్లు.... విసిగిపోయిన మామ

అమెరికాలో ఉన్న టెక్కీ ఝాన్సీకి వరుడు కావలెను అంటూ ఫేమస్ మ్యాట్రీమోనీలో ప్రకటన ప్రత్యక్షం కావడంతో అక్కడ అసలు సమస్య మొదలైయ్యింది. ఆ ప్రకటన చూసిన చాలా మంది అమెరికా భార్యను సొంతం చేసుకోవాలని రోజుకు సుమారు 100 మంది ఆమె తండ్రి పద్మనాభంకు ఫోన్లు చెయ్యడం మొదలుపెట్టారు. నా కూతురికి ఇంకా విడాకులు రాలేదని, అసలు మేము ఆ ప్రకటన ఇవ్వలేదని ఆమె తండ్రి పద్మనాభం ఫోన్లు చేస్తున్న అందరికీ చెప్పుకుంటూ వచ్చాడు. ఎంతమందికి చెప్పినా అతనికి పదేపదే ఫోన్లు రావడంతో విసిగిపోయాడు.

సైబర్ క్రైమ్ పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

సైబర్ క్రైమ్ పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్


ప్రతిరోజూ వందల సంఖ్యలో నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటూ ఆమె తండ్రి పద్మనాభంకు ఫోన్లు చేసి వేదిచారు. లేడీ టెక్కీ ఝాన్సీ తండ్రి పద్మనాభం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టారు. సైబర్ క్రైమ్ సీఐ లిల్లీ, ఎస్ఐ మనోజ్ ప్రభాకర్ రంగంలోకి దిగి ఆరా తీశారు. మ్యాట్రీమోనీలో ప్రకటన ఇచ్చింది ఎవరూ అని ఆరా తీసిన పోలీసులు అసలు మ్యాటర్ తెలుసుకుని బిత్తరపోయారు.

భార్య మీద పగతో ఇంత చేశాడు

భార్య మీద పగతో ఇంత చేశాడు

ఝాన్సీ మీద పగతో ఆమె భర్త ఓంకుమార్ మ్యాట్రీమోనీలో ఆ ప్రకటన ఇచ్చాడని తెలుసుకుని అతన్ని అరెస్టు చేశారు. భార్య జీవితంతో చెలాగటం ఆడిన ఓం కుమార్ ను తిరువళ్లూరు కోర్టులో పరిచిన పోలీసులు న్యాయమూర్తి ఆదేశాలతో ఓంకుమార్ ను తిరువళ్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. మొత్తం మీద భార్య జీవితంతో చెలగాటం ఆడటానికి ప్రయత్నించిన ఓం కుమార్ ఇప్పుడు కటకటాలపాలైనాడు.

English summary
Lady techie: Tamil Nadu Husband arrested for searching for another husband for US wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X