Husband: అన్నం ఇలాగేనా చేసిది ?, మూసుకోని పెట్టింది తినరా, భర్తను చంపేసి !

భువనేశ్వర్: వివాహం చేసుకున్న దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భార్య, పిల్లలతో కలిసి భర్త సంతోషంగా ఉన్నాడు. ఇటీవల దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. రాత్రి ఇంటికి వెళ్లిన భర్త భోజనం పెట్టమని అడిగాడు. భార్య ఆమె భర్తకు భోజనం పెట్టింది. అన్నం ఇలాగేనా చేసేది అంటూ భర్త అతని భార్య మీద మండిపడ్డాడు. నోరు మూసుకుని పెట్టింది తిను అంటూ భార్య రెచ్చిపోయింది. ఇద్దరి మద్య మాటల యుద్దం జరిగింది. మంచి టైమ్ కోసం ఎదురు చూస్తున్న భార్య టవల్ తీసుకుని ఆమె భర్తను గొంతు బిగించి చంపేసింది.

 ఇద్దరు కూతుర్లు

ఇద్దరు కూతుర్లు

ఒడిశాలోని సుందర్ గఢ్ జిల్లాలోని గ్రామంలో హేమంత్ భగ్ అలియాస్ హేమంత్ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం హేమంత్ సరిత (32) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. హేమంత్, సరిత దంపతులకు హేమలత (7), సౌమ్యా (4) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

 భర్తతో గొడవలు

భర్తతో గొడవలు

హేమంత్ కు అతని ఇద్దరు కూతుర్లు అంటే చాలా ప్రాణం. కూతుర్లు ఏమి అడిగినా కాదనకుండా, లేదనకుండా తీసిస్తున్నాడు. కొంతకాలం నుంచి హేమంత్ తో అతని భార్య సరిత గొడవపడుతోందని తెలిసింది. హేమంత్ అన్న జోక్యం చేసుకుని సరితకు, తమ్ముడికి నచ్చచెబుతూ వస్తున్నాడు.

 మూసుకోని పెట్టింది తినరా

మూసుకోని పెట్టింది తినరా

రాత్రి ఇంటికి వెళ్లిన హేమంత్ భోజనం పెట్టమని అతని భార్య సరితకు చెప్పాడు. సరిత ఆమె భర్త హేమంత్ కు భోజనం పెట్టింది. అన్నంలో చీమలు ఉండటాన్ని గమనించిన హేమంత్ అన్నం ఇలాగేనా చేసేది అంటూ అతని భార్య సరిత మీద మండిపడ్డాడు. నోరు మూసుకుని పెట్టింది తిను అంటూ సరిత రెచ్చిపోయింది.

 టవల్ తో భర్త గొంతు బిగించి చంపేసింది

టవల్ తో భర్త గొంతు బిగించి చంపేసింది

ఆ సందర్బంలో హేమంత్, సరిత దంపతుల మద్య మాటల యుద్దం జరిగింది. మంచి టైమ్ కోసం ఎదురు చూస్తున్న సరిత ఆమె భర్త హేమంత్ మెడలో ఉన్న టవల్ తోనే అతని గొంతు బిగించి చంపేసింది. తన భర్త హేమంత్ ఊపిరి ఆడకపోవడంతో చనిపోయాడని సరిత నాటకాలు ఆడింది. హేమంత్ అన్న ఫిర్యాదు చెయ్యడంతో విచారణ చేసిన పోలీసులు హేమంత్ ను హత్య చేసిన అతని భార్య సరితను అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+