
తెలంగాణాలో అద్భుతఘట్టం: నీటిపై తేలియాడే అతిపెద్ద సోలార్ ప్లాంట్, ప్రధాని మోడీ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కారం కాబోతుంది. భారతదేశంలో అతి పెద్ద ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్లాంట్ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభం అవుతుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం వద్ద ఎన్టీపీసీ జలాశయం నీటిపై నిర్మించిన 100 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టును నరేంద్ర మోడీ శనివారం నాడు ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఇక ఈ మహా ఘట్టానికి ఎన్టిపిసి యాజమాన్యం ఏర్పాట్లను సైతం పూర్తి చేసింది.

వర్చువల్ పద్దతిలో అతి పెద్ద ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభించనున్న ప్రధాని
ఇక ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో ఈ ప్లాంట్ ను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఉజ్వల్ భారత్ - ఉజ్వల్ భవిష్య-పవర్ 2047 కార్యక్రమంలో భాగంగా, ప్రధానమంత్రి అతిపెద్ద ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్లాంట్ ను జాతికి అంకితం చేయనున్నారు. భారతదేశంలో రెండు తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయగా వాటిలో ఒకటి రామగుండంలో ఉంది. మరొకటి కేరళ రాష్ట్రంలోని కాయంకుళంలో ఉంది.

రామగుండం ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ప్రత్యేకతలు ఇవే
ఎన్టీపీసీ
అధికారులు
తెలిపిన
వివరాల
ప్రకారం..
రామగుండం
ఫ్లోటింగ్
సోలార్
పవర్
ప్లాంట్
ను
రూ.423
కోట్లతో
నిర్మించారు.
దాదాపు
రెండేళ్ల
పాటు
ఈ
సోలార్
పవర్
ప్లాంట్
నిర్మాణం
జరిగింది.
దాదాపు
ఐదు
వందల
ఎకరాల
జలాశయం
నీటిపై
సౌర
విద్యుత్
కేంద్రం
నిర్మాణం
చేపట్టారు.
40
బ్లాక్
లలో
నిర్మించిన
ఈ
ప్రాజెక్టులో
ఒక్కొక్క
బ్లాక్లో
2.5
మెగావాట్ల
సామర్థ్యంతో
విద్యుదుత్పత్తి
చేపడుతున్నారు.
హై
డెన్సిటీ
పాలిఇథలిన్
తో
తయారుచేసిన
ఫ్లోటర్
లపై
సౌర
ఫలకాలను
ఏర్పాటుచేసి
విద్యుత్తును
ఉత్పత్తి
చేస్తున్నారు.

100 మెగావాట్ల తేలియాడే సోలార్ ప్రాజెక్ట్ వల్ల బొగ్గు ఆదా .. ప్లాంట్ ఉత్పత్తి ఇలా
100
మెగావాట్ల
తేలియాడే
సోలార్
ప్రాజెక్ట్‌ను
ప్రారంభించడం
వల్ల
సంవత్సరానికి
1.65
లక్షల
టన్నుల
బొగ్గు
ఆదా
అవుతుందని
అధికారులు
చెబుతున్నారు.
సంవత్సరానికి
2.1
లక్షల
టన్నుల
కార్బన్
డయాక్సైడ్
ఉద్గారాలను
తగ్గిస్తుందని
వారు
వెల్లడిస్తున్నారు.
100
మెగావాట్ల
రామగుండం
ఫ్లోటింగ్
సోలార్
పవర్
ప్రాజెక్ట్
యొక్క
వాణిజ్య
కార్యకలాపాలు
జూలై
1,
2022న
ప్రారంభమయ్యాయని
చెబుతున్నారు.సాధారణ
ఎండలో
రోజుకు
ఐదు
లక్షల
యూనిట్ల
విద్యుత్
ఉత్పత్తి
చేస్తున్నారు
దీనిలో
నుండి
రెండు
లక్షల
యూనిట్లను
గోవా
రాష్ట్రానికి
పంపించగా,
మిగతా
మూడు
లక్షల
యూనిట్లను
అవసరాల
మేరకు
విక్రయిస్తున్నారు.

నీటిపై తేలియాడే సౌర విద్యుత్ కు రెండు కేంద్రాలు .. జాతికి అంకితం చెయ్యనున్న మోడీ
ఇక
తెలంగాణ
రాష్ట్రం
లో
నిర్మిస్తున్న
అతిపెద్ద
నీటిపై
తేలియాడే
సౌర
విద్యుత్
కేంద్రం
తో
పాటుగా,
కేరళ
రాష్ట్రంలోని
కాయంకుళం
లో
92
మెగావాట్ల
నీటిపై
తేలియాడే
సౌర
విద్యుత్
కేంద్రాలను
మోడీ
జాతికి
అంకితం
చేస్తారు.
ఈ
నీటిపై
తేలియాడే
సౌర
విద్యుత్
ప్లాంట్లను
జాతికి
అంకితం
చేసిన
తర్వాత
ప్రధాని
నరేంద్ర
మోడీ
ప్రజలను
ఉద్దేశించి
ప్రసంగిస్తారు.