వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభం, ఇక కర్ణాటకలో, సీఎం సిద్దూ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ ప్లాంట్ ను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రారంభించారు. మొత్తం 2,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ (సౌర విద్యుత్) ఉత్పత్తి చెయ్యాలని నిర్ణయించారు. 13,000 ఎకరాల స్థలంలో రూ. 16,500 కోట్ల వ్యయంతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేశారు.

తుమకూరు జిల్లా

తుమకూరు జిల్లా

కర్ణాటకలోని తుమకూరు జిల్లా పావగడ సమీపంలోని తిరుమణి గ్రామం సమీపంలో 13 వేల ఎకరాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. మొదటి దశలో 600 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి పనులు పూర్తి అయ్యాయి.

ప్రపంచంలోనే పెద్దది

ప్రపంచంలోనే పెద్దది

తుమకుమారు జిల్లాలోని పావగడలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్ ను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కర్ణాటక గవర్నర్ వాజుబాయ్ వాలా, కేంద్ర మంత్రి రాజ్ కుమార్ సింగ్, కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ తదితరులు గురువారం ప్రారంభించారు.

2,300 మంది రైతులు

2,300 మంది రైతులు

పావగడ తాలుకాలో సోలార్ విద్యుత్ ప్లాంట్ కు భూములు ఇచ్చిన 2,300 మంది రైతులను ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ ప్రాజెక్టులో భాగస్వాములు అయ్యారు. కర్ణాటక ప్రభుత్వం 2,300 మంది రైతులను స్టాక్ హోల్డర్స్, షేర్ హోల్డర్స్, భాగస్వాములుగా చేసింది.

రైతులకు ధన్యవాదాలు

రైతులకు ధన్యవాదాలు

ప్రపంచంలోని అతి పెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చెయ్యడానికి పెద్ద మనసుతో ఒక ఎకరా రూ. 21, 000 వేలకు భూములు ఇచ్చిన అన్నదాతలకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ధన్యవాదాలు చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చెయ్యడానికి అవకాశం కల్పించిన మీరుణం రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ తీర్చుకోలేని సీఎం సిద్దరామయ్య అన్నారు. సోలార్ విద్యుత్ ఒక్క యూనిట్ రూ. 3. 30 పైసలకు సరఫరా చెయ్యాలని నిర్ణయించారు.

English summary
Pavagada Solar Park to be launched by the Karnataka Hon’ble Chief Minister Siddaramaiah on 1st March, 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X