కాలేజ్ లో లవర్స్, పెళ్లి ఫిక్స్, ప్రియురాలు మాట్లాడలేదని లాయర్ అన్నంతపని చేశాడు, వీడియో కాల్!
పుదుచ్చేరి: నాతో నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు, నిన్ను ఎంతగానో ప్రేమించాను, నువ్వు లేకపోతే నేను లేను అంటూ ప్రియురాలికి చెప్పిన యువ న్యాయవాది ఉరి వేసుకున్నాడు. అయితే ఆందోళనతో న్యాయవాది ఇంటి దగ్గరకు ఆ యువతి చేరుకుని అతన్ని ఆసుపత్రికి తరలించింది. అప్పటికే అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రియురాలు మాట్లాడలేదని చిన్న విషయానికి ఆవేశంలో లాయర్ అన్నంతపని చేశాడని పోలీసులు అంటున్నారు.

కాలేజ్ లో లవర్స్
పుదుచ్చేరి సమీపంలోని పుదువై కనకశెట్టి చెరువు ప్రాంతంలో గోతండం అనే రైతు నివాసం ఉంటున్నారు. గోతండం కుమారుడు సురేష్ (31) న్యాయవాది. కాలేజ్ లో చదువుకునే సమయంలో సురేష్, చత్తకళూరు ప్రాంతానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. సురేష్, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలని అప్పట్లో నిర్ణయించారు.

మధ్యలో మరో యువతి
కడలూరుకు చెందిన యువతి సురేష్ ను ఇష్టపడింది. పెద్దలు సురేష్ కు కడలూరు అమ్మాయికి పెళ్లి చెయ్యాలని నిర్ణయించారు. ప్రియురాలు దూరం అవుతుందోని మొదట సురేష్ అయోమమంలో ఉన్నాడు. తరువాత పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకోవడానికి సురేష్ అంగీకరించాడు. ఈ విషయం సురేష్ అతని ప్రియురాలికి చెప్పాడు.

నిశ్చితార్థం, పెళ్లి డేట్ ఫిక్స్
సురేష్, కడలూరు అమ్మాయికి ఇటీవల నిశ్చితార్థం జరిగింది. జనవరి 27వ తేదీన పెళ్లి చెయ్యాలని డేట్ ఫిక్స్ చేశారు. తరువాత కాబోయే భార్యను పిలుచుకుని పుదుచ్చేరి వెళ్లిన సురేష్ పెళ్లికి అవసరం అయిన నగలు, పెళ్లి బట్టలు తీసుకున్నాడు. తరువాత సురేష్ కాబోయే భార్యతో వివిద ప్రాంతాల్లో తిరిగాడు. అనంతరం కాబోయే భార్యను కడలూరు బస్సు ఎక్కించి ఇంటికి పంపించాడు.

ప్రియురాలు ఫోన్ తియ్యలేదని !
తనకు పెళ్లి జరుగుతోందని, పెళ్లి పత్రిక తీసుకుని వస్తానని అప్పటికే సురేష్ ప్రియురాలికి చెప్పాడు. తాను వచ్చి పెళ్లి పత్రిక తీసుకుంటానని ప్రియురాలు చెప్పింది. కాబోయే భార్య కడలూరు వెళ్లిపోయిన తరువాత సురేష్ కు ఫోన్ చేశాడు. అయితే సురేష్ ఫోన్ కాల్ ను అతని ప్రియురాలు రిసీవ్ చెయ్యలేదు.

ఆత్మహత్య చేసుకుంటున్నా
ప్రియురాలు ఎంత సేపటికి ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో సురేష్ విసిగిపోయాడు. తరువాత నువ్వు ఎందుకు నాతో మాట్లాడటం లేదు, నీ అనుమతి తీపుకునే నేను వివాహం చేసుకుంటున్నాను కదా, నువ్వు మాట్లాడని ఈ జీవితం తనకు అనవసరం, నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియో కాల్ రికార్డు చేసిన సురేష్ దానిని ప్రియురాలు మొబైల్ కు పంపించాడు.

ఆట పట్టిస్తున్నాడని !
సురేష్ తనను బెదిరించడానికి అలా చేస్తున్నాడని ఆ యువతి భావించింది. అయితే ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడో అనే ఆందోళన మాత్రం ఆమెలో అలాగే ఉంది. వెంటనే ఆ యువతి సురేష్ ఇంటి దగ్గరకు వెళ్లింది. అప్పటికే సురేష్ ఇంటి లోపల గడియపెట్టుకున్నాడు. ఎంత సేపటికి సురేష్ తలుపులు తియ్యకపోవడంతో స్థానికులు ఇంటి తలుపులు పగలగొట్టారు. అప్పటికే ఫ్యాన్ కు సురేష్ ఉరి వేసుకుని వేలాడుతున్నాడు. వెంటనే సురేష్ ను కిందకు దించి బిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సురేష్ మరణించాడని పోలీసులు తెలిపారు. ప్రియురాలు మాట్లాడలేదని సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడని, కేసు విచారణలో ఉందని పోలీసులు అంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications