నా కోరిక తీర్చు.. హాల్ టికెట్ తీసుకో: విద్యార్థినికి ఓ అధ్యాపకుడి ఆఫర్

Posted By:
Subscribe to Oneindia Telugu

నాగ్‌పూర్‌: గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో కొనసాగుతూ ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఇది. పరీక్షలో కాపీ కొడితే మందలించాలి.. లేదంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.

కానీ ఈ అధ్యాపకుడు అలా చేయలేదు. ఆ ఘటనను తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్నాడు. లాగేసుకున్న హాల్‌టికెట్‌ తిరిగి ఇవ్వాలంటే తన కోరిక తీర్చాలని పట్టుబడ్డాడు. బాధిత విద్యార్థిని దీని గురించి తన బంధువులకు, స్నేహితులకు చెప్పడంతో ఈ కీచకపర్వం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Lecturer booked for molestation in Nagpur

వివరాల్లోకి వెళితే... నాగ్‌పూర్‌లోని ఓ పాలిటెక్నిక్‌ కళాశాలలో అమిత్‌ గన్వీర్‌ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. మరో కళాశాలలో చదువుతూ.. తమ కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

ఏప్రిల్‌ 13న జరిగిన పరీక్ష సమయంలో కాపీ కొడుతోందన్న ఆరోపణపై సదరు విద్యార్థిని గుర్తింపు కార్డు, హాల్‌ టికెట్‌, మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నాడు. వాటిని తిరిగి ఇవ్వాలంటే తన కోరిక తీర్చాలని, ఒక రాత్రి తనతో గడపాలని కోరాడు.

ఈ విషయాన్ని సదరు యువతి తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలిపి, వారి సలహా మేరకు అంబజరి పోలీస్‌స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి గురువారం ఆ కీచక అధ్యాపకుడిని అరెస్ట్‌ చేశారు.

నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 354 కింద కేసు నమోదు చేశారు. కాగా, విషయం వెలుగులోకి రావడంతో శివసేన, యువక్రాంతికి చెందిన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సదరు అధ్యాపకుడి ముఖానికి ఇంకు పూశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
NAGPUR: Police today registered a case against a lecturer of a city-based polytechnic college for allegedly molesting a girl student. The incident took place on April 13 when the girl appeared for her college exam at Dharampeth Polytechnic College, which was her examination center. The victim studies in a different polytechnic college, police said. According to police, the accused Amit Ganvir had caught the girl copying during the exam. "The girl later complained that the accused, Amit Ganvir, who is the lecturer at Dharampeth Polytechnic College and was the supervisor in her exam hall, had snatched her identity card, exam hall ticket and her mobile phone during the exam," in-charge of Ambhazari police station, inspector Atul Sabnis told PTI.
Please Wait while comments are loading...