జయలలిత ఎస్టేట్‌లో ఆడ చిరుత.. ఎట్టకేలకు పట్టివేత
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఊటీలోని నీలగిరి పర్వతాల్లో ఓ ఎస్టేట్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దాని పేరు కొడనాడు. ఆ ఎస్టేట్‌లోకి ప్రవేశించిన నాలుగేళ్ల ఆడ చిరుత పులిని అటవీ అధికారులు తెగ ఇబ్బందులు పెట్టింది.

కొన్ని రోజుల పాట శ్రమించి ఎట్టకేలకు ఆ ఆడ చిరుతను పట్టుకున్నారు. అంతక ముందు ఆ చిరుత కొన్ని లేగ దూడలను చంపిందని సమీప గ్రామస్తులు తెలిపారు. దీంతో, ఆ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు జయలలిత బంగ్లాకు సమీపంలో బోనులు, కెమెరాలను జయ ఎస్టేట్‌లో ఏర్పాటు చేశారు.
చివరకు బంధించిన తర్వాత భవానీ అడవులు ఎగువభాగాన విడిచిపెట్టారు. అక్రమాస్తుల కేసులో బెంగుళూరు జైలు నుంచి విడుదలైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.












Click it and Unblock the Notifications