త్వరలో భారత్ కు నీరవ్ మోడీ అప్పగింత- బ్రిటన్ కోర్టు లైన్ క్లియర్.. !

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను మోసం చేసి లండన్ కు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని త్వరలో భారత్ రప్పించేందుకు మార్గం సుగమమైంది. భారత్ లో బ్యాంకుల్ని ముంచి ఐదేళ్ల క్రితం లండన్ పారిపోయిన మోడీ అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. దీంతో ఆయన్ను భారత్ కు రప్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తూనే ఉంది.

నీరవ్ మోడీపై భారత్ లో మోసం, మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఆయన్ను ఈ ఆరోపణలపై విచారించేందుకు భారత్ కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ పరారీలో ఉన్న నీరవ్ మోదీ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను యూకే హైకోర్టు ఇవాళ తిరస్కరించింది. 13 వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో 51 ఏళ్ల నీరవ్ మోదీ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. పీఎన్బీ కుంభకోణం బయటపడ్డాక, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్ధలు విచారణ ప్రారంభించాయి. దీంతో మోడీ లండన్ కు పరారయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో భారత్ బ్రిటన్ ను నీరవ్ మోడీని అప్పగించాలని కోరడం, లుక్ అవుట్ నోటీసులు జారీకావడంతో బ్రిటన్ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉంచారు.

 line clear for nirav modis extradition to india-he looses appeal in british court

మానసిక ఆరోగ్య కారణాలు చూపి తనను భారత్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నీరవ్ మోదీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే నీరవ్ మోడీని అప్పగించడం "అన్యాయం లేదా అణచివేత" కాదని రాయల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ పేర్కొంది. నీరవ్ మోడీ అప్పీలుపై అక్టోబర్ 12నే విచారణ పూర్తిచేసిన కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ ఆ తీర్పు వెలువరించింది. దీంతో భారత్ నీరవ్ మోడీని తీసుకెళ్లేందుకు మార్గం సుగమమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+