అనూహ్యం: అసెంబ్లీ ఎన్నికల కోసం లోక్‌సభ నిరవధిక వాయిదా -అర్ధాంతరంగా ముగిసిన బడ్జెట్ సమావేశాలు
చట్టసభల నిర్వహణ విషయంలో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న మోదీ సర్కార్ మరో అనూహ్య చర్యకు పాల్పడింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం ఏకంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను కుదించారు. అర్ధాంతరంగా భేటీని ముగించేసి, లోక్ సభను నిరవధికంగా వాయిదా వేసేలా చేశారు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8 వరకు బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉన్నా, ఎన్నికల నేపథ్యంలో ముందుగానే ముగించారు.
స్పీకర్ ఓంబిర్లా కరోనా బారినపడి ఆస్పత్రిలో ఉండగా, గురువారం సభాపతిగా వ్యవహరించిన ప్యానల్ స్పీకర్ బర్తుహరి మహతబ్ .. లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడానికి ముందు సభలో చేపట్టిన కార్యకలాపాల గురించి వెల్లడించారు. ఈ సారి 24 సిట్టింగ్స్ లో మొత్తం 132 గంటల పాటు లోక్ సభలో కార్యకలాపాలు జరిగాయి.

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా 16 గంటల పాటు, కేంద్ర బడ్జెట్ 2021పై 14 గంటల 42 నిమిషాల పాటు చర్చ జరిగింది. అలాగే డిమాండ్ ఫర్ గ్రాంట్స్‌పై 21 గంటల 43 నిమిషాల పాటు చ్చించారు.
ఈసారి సమావేశాల్లో 17 ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టారు. 18 బిల్లులను ఆమోదించారు. 84 స్టార్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. స్టాండిగ్ కమిటీలు 163 నివేదికలను సమర్పించాయి. మొత్తం 3591 పేపర్స్‌ను టేబుల్‌పై ఉంచినట్లు ప్యానల్ స్పీకర్ బర్తుహరి తెలిపారు. ఈసారి లోక్‌సభ సమావేశాల్లో పని తీరు బాగుందని, ప్రొడక్టివిటీ రేటు 114 శాతం ఉన్నట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications