ముస్లీంల తొలి దైవం శివుడే, వారే పుట్టించారు: ముస్లీం మత గురువు
లక్నో: ముస్లీంల తొలి దైవం పరమశివుడేనని, ముస్లీంలు అందరు ఒకప్పుడు సనాత ధర్మాన్ని పాటించేవారని జమైత్ ఉలేమాకు చెందిన మతగురువు ముఫ్తీ మొహమ్మద్ వ్యాఖ్యానించారు. మనలను సృష్టించింది ఆది దంపతులు శివపార్వతులే అన్నారు.
తాము భారత దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించడాన్ని వ్యతిరేకించమని చెప్పారు. చైనా, జపాన్‌లో నివసిస్తున్న వారిని ఎలాగైతే చైనీయులు, జపనీయులు అంటామో.. అలాగే భారత దేశంలో మనల్ని హిందుస్తానీ అనవచ్చునని వ్యాఖ్యానించారు.

జమైత్ ఉలేమాకు చెందిన పలువురు మత నాయకులు అయోధ్యను సందర్శించారు. ఈ నెల 27వ తేదీన జరిగే మత హింస వ్యతిరేక సదస్సుకు హాజరు కావాలని పలువురు సాధువులను వారు కోరారు. వారు బుధవారం అయోధ్యలో పర్యటించారు.












Click it and Unblock the Notifications