అంత్యక్రియలకు కారులో బయలుదేరారు: మార్గం మధ్యలో లారీ ఢీకొని నలుగురి దుర్మరణం !
బంధువు అంత్యక్రియలకు కారులో బయలుదేరారుమార్గం మధ్యలో ఎదురుగా వేగంగా వచ్చి కారును ఢీకొన్న లారీనలుగురి దుర్మరణం, ఇద్దరు చిన్నారులతో సహ ఐదు మందికి తీవ్రగాయాలు
బళ్లారి: బంధువు అంత్యక్రియలకు హాజరుకావడానికి వెలుతున్న వారి కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెంది ఐదు మందికి తీవ్రగాయాలైన ఘటన కర్ణాటకలోని హోసపేట తాలుకా పాపినాయకనహళ్ళి గ్రామం సమీపంలో జరిగింది.
చిత్రదుర్గ జిల్లా హిరయూరులో నివాసం ఉంటున్న శ్రీనివాస్ (46), వెంకటమ్మ (45), నళిని (30), మరో వ్యక్తి దుర్మరణం చెందారు. ఇద్దరు పిల్లలతో సహ ఐదు మందికి తీవ్రగాయాలు కావడంతో కోప్పళలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స చేయిస్తున్నారు.

శ్రీనివాస్ దగ్గర బంధువులు హోసపేటలో నివాసం ఉంటున్నారు. హోసపేటలోని బంధువు చనిపోవడంతో శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం కారులో అంత్యక్రియలకు హాజరుకావడానికి బయలుదేరారు. మార్గం మధ్యలో జాతీయరహదారి 14లో పాపినాయకనహళ్ళి గ్రామం దగ్గర ఎదురుగా వచ్చిన లారీ కారును ఢీకొనింది. ఈ ప్రమాదంలో నలుగురు సంఘటనా స్థలంలోనే మరణించారని పోలీసులు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారైనాడని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications