ఏమైంది?: రూ. 500కోట్లతో వెళ్తున్న లారీ రోడ్డుపై ఆగింది!
చెన్నై: ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనిఖీల్లో రూ.570 కోట్ల నగదు పట్టుబడ్డ ఘటన మరవకముందే ఆదివారం అలాంటి ఘటనే మరోటి మదురైలో వెలుగుచూసింది.
రూ.500 కోట్ల నగదు తీసుకెళ్తున్న రెండు కంటైనర్ లారీల్ని మదురై జిల్లా తిరుమంగళం వద్ద టీ తాగేందుకు డ్రైవర్లు ఆపారు. అనంతరం లారీల్ని స్టార్ట్ చేయగా ఒకటి మొరాయించింది.

కంటైనర్లలో డబ్బు విషయం చుట్టుపక్కల వ్యాపించడంతో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. లారీలకు ఎస్కార్టుగా ఉన్న సీఐఎస్‌ఎఫ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ మణికంఠన్, పదిమంది కమాండో పోలీసులు జనాన్ని అదుపు చేసేందుకు తంటాలు పడ్డారు.
కాగా, సమాచారం అందుకున్న స్థానిక డీఎస్పీ సిబ్బందితో అక్కడికి చేరుకుని భద్రత కల్పించారు. జనాన్ని అక్కడినుంచి పంపించేశారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో తరచూ చోటుచేసుకుంటుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications