కరోనా సెకండ్ వేవ్ బీభత్సం.. మృతుల్లో ఎక్కువ 45 ఏళ్ళ లోపు వారే .. వెల్లడించిన స్టడీ !!

కరోనా మొదటి వేవ్ కంటే, కరోనా సెకండ్ వేవ్ అత్యంత ఘోరమైనదని, ఒక ప్రైవేటు చైన్ ఆసుపత్రుల చికిత్సల డేటా ఆధారంగా సేకరించిన సమాచారం వెల్లడించింది. కరోనా మొదటి తరంగం కంటే రెండవ తరంగంలో అత్యధిక మరణాలు సంభవించాయని ఇది పేర్కొంది. మ్యాక్స్ హెల్త్ కేర్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం కరోనా సెకండ్ వేవ్ లో ఆసుపత్రిలో చేరిన రోగులలో మరణాల రేటు మొదటి వేవ్ కంటే 40% ఎక్కువ ఉందని అధ్యయనం వెల్లడించింది.

 ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లో 40% ఎక్కువ మరణాలు

ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లో 40% ఎక్కువ మరణాలు


రెండవ వేవ్ లో 2021 జనవరి నుండి జూన్ మధ్య వరకు ఆసుపత్రిలో చేరిన 5,454 మంది రోగుల మరణాల నిష్పత్తి 10.5% వద్ద ఉన్నట్టుగా ప్రైవేట్ చైన్ ఆస్పత్రుల డేటా ఆధారంగా గుర్తించారు. ఇది మహమ్మారి యొక్క మొదటి తరంగంలో 2020 వ సంవత్సరం ఏప్రిల్ నెల నుండి డిసెంబర్ నెల వరకు ఆసుపత్రిలో చేరిన 14,398 మంది రోగులలో 7.2% మరణాల రేటు కంటే 40% ఎక్కువ. మెడికల్ జర్నల్ మెడ్ఆర్క్సివ్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం, ఉత్తర భారతదేశం అంతటా మాక్స్ హెల్త్‌కేర్ నిర్వహిస్తున్న10 ఆస్పత్రుల నుండి సేకరించిన కోవిడ్ డేటా, ఢిల్లీ -ఎన్‌సిఆర్‌లో ఆరు ఆస్పత్రుల ఆధారంగా తీసుకున్న డేటా ఆధారంగా ఉన్నాయి.

మ్యాక్స్ కేర్ గ్రూప్ అధ్యయనం .. సెకండ్ వేవ్ లో మరణాలు మూడు రెట్లు పెరిగాయని వెల్లడి

మ్యాక్స్ కేర్ గ్రూప్ అధ్యయనం .. సెకండ్ వేవ్ లో మరణాలు మూడు రెట్లు పెరిగాయని వెల్లడి

ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన మాక్స్ హెల్త్‌కేర్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ బుధిరాజా మరణాలలో దారుణమైన పెరుగుదల 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో కనిపించింది. 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిలో సెకండ్ వేవ్ లో కోవిడ్ -19 కారణంగా మరణాలు మూడు రెట్లు పెరిగాయని ఆయన వెల్లడించారు. మరణాల పెరుగుదల ధోరణి ఇతర వయసులవారిలో కూడా కనిపించిందని వెల్లడించారు. 45-59 సంవత్సరాల వయస్సు వారిలో మరణాలు మొదటి తరంగంలో 5% నుండి రెండవ తరంగంలో 7.6% కి పెరిగాయని పేర్కొన్నారు.

ఎక్కువ మరణాలకు ఆస్పత్రుల సమస్య, ఆరోగ్య మౌలిక వసతుల లేమి కారణం

ఎక్కువ మరణాలకు ఆస్పత్రుల సమస్య, ఆరోగ్య మౌలిక వసతుల లేమి కారణం


60-74 సంవత్సరాల వయసు వారిలో పెరుగుదల 12% నుండి 13.8%, 75 ఏళ్లు పైబడిన వారిలో 18.9% నుండి 26.9% వరకు పెరిగిందని వెల్లడించారు. సెకండ్ వేవ్ లో మరణాలు పెరగడానికి ఆసుపత్రులలో బెడ్ లు దొరక్క పోవటం, ఆక్సిజన్ కొరత, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు పూర్తిగా అందుబాటులో లేకపోవడం మరణాలకు దోహదం చేసిందని డాక్టర్ బుధిరాజా అన్నారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ అవసరం కూడా పెరిగిందన్నారు.

 సెకండ్ వేవ్ లో 74% మందికి ఆక్సిజన్ అవసరం అయిందని తేల్చిన అధ్యయనం

సెకండ్ వేవ్ లో 74% మందికి ఆక్సిజన్ అవసరం అయిందని తేల్చిన అధ్యయనం


మహమ్మారి యొక్క మొదటి తరంగంలో, ఆసుపత్రిలో చేరిన కోవిడ్ -19 రోగులలో 63% మందికి ఆక్సిజన్ మద్దతు అవసరం అయ్యిందని. కానీ సెకండ్ వేవ్ లో 74% అంటే ఆసుపత్రిలో చేరిన నలుగురిలో దాదాపు ముగ్గురికి ఆక్సిజన్ మద్దతు అవసరం అయ్యిందని అధ్యయనం వెల్లడించింది.కోవిడ్ -19 వైరస్ యొక్క డెల్టా వేరియంట్ ఎక్కువగా ప్రభావం చూపించిందని, ఎక్కువ మంది ప్రాణాలు పోవడానికి కారణం అయిందని వైద్యులు తెలిపారు.

 డెల్టా వేరియంట్ వల్ల కూడా అత్యంత దారుణ స్థితి

డెల్టా వేరియంట్ వల్ల కూడా అత్యంత దారుణ స్థితి

భారతదేశంలో మొట్టమొదట గుర్తించిన ఈ జాతి ఇప్పుడు అమెరికా మరియు యుకెతో సహా అనేక దేశాలకు వ్యాపించింది.కరోనా సెకండ్ వేవ్ లో బ్యాక్టీరియా మరియు ఫంగస్ ల వల్ల కలిగే అంటువ్యాధులు కూడా గణనీయంగా పెరిగాయని ఆసుపత్రిలో చేరిన చాలా మంది రోగులలో ఇది మరణాలకు కారణమైందని అధ్యయనం వెల్లడించింది.కోవిడ్ మేనేజ్‌మెంట్ పాలసీల్లోని అంతరాలను గుర్తించి వాటిని సరిదిద్దడం ముఖ్యమని ప్రజారోగ్య నిపుణులు అంటున్నారు.

కరోనా థర్డ్ వేవ్ పై అలెర్ట్ చేస్తున్న ఐసిఎంఆర్

కరోనా థర్డ్ వేవ్ పై అలెర్ట్ చేస్తున్న ఐసిఎంఆర్

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన ఒక అధ్యయనం,కరోనా థర్డ్ వేవ్ పై అలర్ట్ చేస్తోంది . అది కరోనా సెకండ్ వేవ్ కంటే ప్రమాదకరంగా ఉండొచ్చని, ఇప్పటి నుండే దానిని ఎదుర్కోవడానికి సంసిద్ధత ప్రణాళికను సిద్ధం చేసుకుని, పకడ్బందీ పాలసీతో ముందుకు వెళితే ఎక్కువ నష్టం జరగకుండా బయటపడవచ్చని చెప్తోంది. ఏది ఏమైనా భారతదేశంలో కరోనా మొదటి వేవ్ కంటే కరోనా సెకండ్ వేవ్ అత్యంత ప్రమాదకరంగా మారి లక్షల్లో ప్రజల ప్రాణాలు తీసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+