Exams: ఇంటర్ పరీక్షలు, హిజాబ్ నాట్ అలౌడ్, తేల్చి చెప్పిన విద్యాశాఖా మంత్రి, తరువాత మీ ఇష్టం !
బెంగళూరు: హిజాబ్ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఇంటర్ పరీక్షలకు హిజాబ్ వేసుకుని వస్తే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వమని కర్ణాటక విద్యాశాఖా మంత్రి బీసీ. నాగేష్ స్పష్టం చేశారు. ఇంటర్ పరీక్షలకు హాజరౌతున్న విద్యార్థులు కచ్చితంగా కర్ణాటక హైకోర్టు ఆదేశాలు పాటించాలని, పరీక్షలు రాయడానికి వచ్చే వారు కచ్చితంగా యూనీఫామ్ వేసుకోవాలని, ఎవరైనా కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖా మంత్రి బీసీ నాగేష్ స్పష్టం చేశారు. కర్ణాటకలో హిజాబ్ వివాదం మొదలైన తరువాత కర్ణాటక ప్రభుత్వం ఎస్ఎస్ఎల్ సీ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పుడు ఇంటర్ పరీక్షలు కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 22వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు కర్ణాటకలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.

హిజాబ్ వివాదం
కర్ణాటకలోని ఉడిపిలో హిజాబ్ లు వేసుకుని ప్రభుత్వ కాలేజ్ ల్లోకి అడుగు పెట్టకూడదని ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ అడ్డుకోవడంతో పెద్దరాద్దాంతం అయ్యింది. హిజాబ్ వివాదం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా రచ్చరచ్చ అయ్యింది. హిజాబ్ లు వేసుకోకుండా చదువుకోవడానికి మేమురాలేమని తేల్చి చెప్పిన కొందరు ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు తీర్పు
హిజాబ్ వివాదంపై దాఖలు అయిన అన్ని పిటిషన్లు విచారణ చేసిన కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ప్రభుత్వం సూచించిన యూనీఫామ్ మాత్రమే వేసుకుని కాలేజ్ ల్లోకి వెళ్లాలని, హిజాబ్ తో పాటు మతపరమైన దుస్తులు వేసుకుని విద్యాసంస్థల్లోకి అడుగుపెట్టకూడదని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఇప్పుడు ముస్లీం అమ్మాయిలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఎస్ఎస్ఎల్ సీ పరీక్షలు
కర్ణాటకలో హిజాబ్ వివాదం మొదలైన తరువాత కర్ణాటక ప్రభుత్వం ఎస్ఎస్ఎల్ సీ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పుడు ఇంటర్ పరీక్షలు కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 22వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు కర్ణాటకలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.

హిజాబ్ నాట్ అలౌడ్
ఇంటర్ పరీక్షలకు హిజాబ్ వేసుకుని వస్తే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వమని కర్ణాటక విద్యాశాఖా మంత్రి బీసీ. నాగేష్ స్పష్టం చేశారు. ఇంటర్ పరీక్షలకు హాజరౌతున్న విద్యార్థులు కచ్చితంగా కర్ణాటక హైకోర్టు ఆదేశాలు పాటించాలని, పరీక్షలు రాయడానికి వచ్చే వారు కచ్చితంగా యూనీఫామ్ వేసుకోవాలని, ఎవరైనా కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖా మంత్రి బీసీ నాగేష్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications