వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lunar eclipse 2022: గ్రహణసమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఆహారపదార్ధాలపై దర్భల వెనుక బిగ్ రీజన్!!

|
Google Oneindia TeluguNews

నేడు చంద్రగ్రహణం. ఈరోజు సాయంత్రం చంద్రగ్రహణం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభమై 6:18 నిముషాలకు ముగుస్తుంది. చంద్ర గ్రహణం కారణంగా ఇప్పటికే అనేక ఆలయాలు మూతపడగా, చంద్రగ్రహణం రోజు ప్రతి ఒక్కరూ కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఒక్క చంద్రగ్రహణం మాత్రమే కాదు, సూర్యగ్రహణం కూడా మానవ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది అని చెబుతున్నారు. అందుకే గ్రహణాలు ఏవైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

చంద్రగ్రహణం ఎఫెక్ట్: ఏపీలో తిరుమల, బెజవాడ దుర్గమ్మతో పాటు ప్రముఖఆలయాల మూసివేత, పునః దర్శనాలిలా!!చంద్రగ్రహణం ఎఫెక్ట్: ఏపీలో తిరుమల, బెజవాడ దుర్గమ్మతో పాటు ప్రముఖఆలయాల మూసివేత, పునః దర్శనాలిలా!!

గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే


గ్రహణాల రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే గ్రహణ సమయంలో వీలైనంత వరకు ఎవరు బయటకు వెళ్ళకుండా ఉండాలి. గ్రహణ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయి కాబట్టి, ఆ మార్పులు సంభవించే సమయంలో భూమి మీద పడే కిరణాలు మనుషుల శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి గ్రహణ సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్లకూడదు. ఇక గ్రహణానికి రెండు గంటల ముందు భోజనం పూర్తి చేయాలి. గ్రహణానికి ముందు, గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేయాలి. గ్రహణ సమయంలో బరువైన పనులు చెయ్యకూడదు. గ్రహణ సమయంలో మెటల్ వస్తువులకు దూరంగా ఉండాలి. గ్రహణ సమయంలో వేటిని కట్ చేయకూడదు.

 గ్రహణ సమయంలో ఆహారంపై గరిక దర్భలను ఉంచాలి

గ్రహణ సమయంలో ఆహారంపై గరిక దర్భలను ఉంచాలి


ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణాలను చూడకూడదు. వారు గ్రహణ సమయంలో రెస్ట్ తీసుకోవాలి. కష్టమైన పనులు చేయడం కానీ, ఆహారం తీసుకోవడం కానీ చేయకూడదు. గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపై గరికను వేసి ఉంచాలి. గ్రహణం విడిచిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకొని, ఆ పైన మాత్రమే ఆహార పదార్థాలను ఉపయోగించాలి. ఇక గ్రహణ సమయంలో ఆహార పదార్థాలలో గరికను వేయడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. గ్రహణ సమయంలో భూమి మీదకు ప్రమాదకరమైన కిరణాలు ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంటుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖ పైకి వచ్చిన క్రమంలో ఏర్పడే గ్రహణాలు, ఆ కారణంగా భూమి మీదకు ప్రసరించే కిరణాలు మానవుల జీవితాలపై తీవ్రప్రభావాన్ని చూపిస్తాయి.

ఆహార పదార్థాలపై దర్భలను ఉంచటం వెనుక కారణం ఇదే

ఆహార పదార్థాలపై దర్భలను ఉంచటం వెనుక కారణం ఇదే


ఇక ఈ కిరణాలు పడినటువంటి ఆహారపదార్ధాలు తీసుకున్నా అనారోగ్యం సంభవిస్తుంది. అందుకే ఈ సమయంలో పని చేయకూడదని, ఆహారపదార్థాలు ముట్టుకోకూడదు అని చెబుతూ ఉంటారు. ఇక ఆహార పదార్థాలపై దర్భలను వేయడంలో కూడా ఆంతర్యం ఉంది. ఆహార పదార్థాలలో దర్భలను వేయడం వల్ల గ్రహణ ప్రభావం వల్ల వచ్చే కిరణాల ప్రభావాన్ని దర్భలు లాక్కుంటాయి. దీంతో కొంతమేర మనం రేడియేషన్ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్న పరిస్థితి ఉంది.

గ్రహణ సమయంలో పెద్దలు చెప్పిన నియమాలు పాటిస్తే మంచిది

గ్రహణ సమయంలో పెద్దలు చెప్పిన నియమాలు పాటిస్తే మంచిది


దర్భలు అతినీలలోహిత కిరణాలను గ్రహణ సమయంలో భూమి పైకి వచ్చే హానికరమైన కిరణాలను తనలోకి తీసుకొని మన ఆహార పదార్థాలను కాపాడతాయి. ఆ కిరణాల విషప్రభావం నుంచి ఆహారాన్ని కాపాడతాయి. కాబట్టే గ్రహణ సమయంలో దర్భలు కచ్చితంగా ఆహార పదార్థాల పై ఉండాలని చెబుతున్నారు. ఆహార పదార్థాలు, పచ్చళ్ళు వంటివాటిపై దర్భలను ఉంచడం వల్ల గ్రహణ ప్రభావం వాటిపై పడదని చెబుతున్నారు. ఏది ఏమైనా సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని, పెద్దలు చెప్పిన నియమాలను పాటిస్తే మంచిదని సూచిస్తున్నారు.

English summary
Today is lunar eclipse. So it is said to be careful not to go outside during the eclipse and not to do many things. It is said that if you put darbhas on the food items at home during the eclipse, the harmful rays coming during the eclipse will not affect the food.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X