ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు: క్లారిటీ ఇచ్చిన తమిళనాడు సీఎం, పన్నీర్ !
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం. వెంకయ్యనాయుడికి మద్దతు ఇస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి అన్నారు.
చెన్నై: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం. వెంకయ్యనాయుడికి మద్దతు ఇస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి అన్నారు. తమిళనాడు మంత్రి వర్గం, ఎమ్మెల్యేలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.
అన్నాడీఎంకే (అమ్మ) వర్గంలోని ఎమ్మెల్యేలు అందరూ ఎం. వెంకయ్యనాయుడుకే మద్దతు ఇస్తామని ఇప్పటికే తనకు చెప్పారని అన్నారు. దక్షిణ భారతదేశం నుంచి ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పోటీ చెయ్యడం చాల సంతోషంగా ఉందని తెలిపారు.

ఇక రాష్ట్రపతిగా భారీ మెజారిటీతో విజయం సాదించిన రాజ్ నాథ్ కోవింద్ కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి అభినందనలు తెలిపారు. అదే విధంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సైతం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు అభినందనలు తెలిపారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎం. వెంకయ్యనాయుడికి పన్నీర్ సెల్వం వర్గం మద్దతు ఇవ్వనుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇచ్చే విషయంలో టీటీవీ దినకరన్ వర్గం ఏ విషయం చెప్పకుండా గోడ మీద దీపం పెట్టింది.












Click it and Unblock the Notifications