నిశ్చితార్థానికి ముందు యువకుడి పురుషాంగం కోసేశారు
భోపాల్: నిశ్చితార్థానికి ముందు పాతికేళ్ల యువకుడి పురుషాంగాన్ని కోసేశారు. బహిరంగ మలవిసర్జనకు వెళ్లిన యువకుడిపై ఆ దాడి జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. మర్మాంగాన్ని కోసేసి దాన్ని దుండగులు తీసుకుని వెళ్లారు.
మధ్యప్రదేశ్‌లోని మోరెనా జల్లాలో గల కైలరాస్ ప్రాంతంలో గురువారంనాడు ఆ సంఘటన జరిగింద. పాతికేళ్ల యువకుడు కాలువ పక్కన మల విసర్జనకు వెళ్లాడు. అక్కేడ యువకుడిపై దుండగులు దాడి చేశారు.

ప్రస్తుతం ఆ యువకుడు మాట్లాడే స్థితిలో లేడని, వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు అంటున్నారు. యువకుడి మర్మాంగం కోసం సంఘటనా స్థలంలో గాలించామని, కానీ అది దొరకలేదని చెప్పారు. ఆాధారాలు సేకరిస్తన్నట్లు తెలిపారు.
కాలువ పక్కన మలవిసర్జనకు వెళ్లిన యువకుడిపై ఇద్దరు దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు. ఫిబ్రవరి 6వ తేదీన ఆ యువకుడికి నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఈ పని ఎవరు చేశారనే విషయాన్ని యువకుడి కుటుంబ సభ్యులు చెప్పలేకపోతున్నారు.












Click it and Unblock the Notifications