మిజోరాంలో భూకంపం: 4.3గా తీవ్రత నమోదు, ఆందోళనలో జనం
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో దేశంలో ఏదో ఓ మూలన భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఈ భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారితో భయాందోళనలో ఉన్న ప్రజలకు ఈ భూకంపాలు మరింత ఆందోళనలకు గురిచేస్తున్నాయి.
తాజాగా మిజోరాం రాష్ట్రంలో భూకంపం సంభవించింది. గురువారం మధ్యాహ్నం 2.28 గంటలకు మిజోరాంలోని ఈశాన్య లుండార్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టారు స్కేలుపై 4.3గా నమోదైంది.

భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయంతో బయటకి పరుగులు తీశారు. మిజోరాంలోని చంపాయికి 23 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. గత కొద్ది రోజుల క్రితమే మిజోరాంలో స్వల్ప తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications