మహా కుంభమేళాలో తొక్కిసలాట: మౌని అమావాస్య పోటెత్తిన జనసంద్రం

Mahakumbh 2025: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న మహా కుంభ మేళా 2025లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మంది భక్తులు మరణించినట్లు తెలుస్తోంది. దీన్ని ఇప్పటివరకు ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు.

Mahakumbh mela

పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. ఈ ఘటన పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మినిట్ టు మినిట్ మీకోసం..

Jan 29, 2025, 12:08 pm IST
ఢిల్లీ

మహా కుంభమేళా తొక్కిసలాట ఉదంతం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటన కలచివేసిందని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోన్నానని అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.
Jan 29, 2025, 11:24 am IST
ఉత్తర్ ప్రదేశ్

మౌని అమావాస్య సందర్భంగా 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు. త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద పుణ్యస్నానాలను ఆచరించడానికి వెళ్లడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది- ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
Jan 29, 2025, 10:47 am IST
ఉత్తర్ ప్రదేశ్

మహా కుంభమేళా తొక్కిసలాట పట్ల సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. గాయపడ్డ వారికి ఎయిర్ అంబులెన్స్ ద్వారా సమీప అత్యుత్తమ ఆసుపత్రులకు తరలించాలని, మెరుగైన వైద్య సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు.
Jan 29, 2025, 10:43 am IST
ఢిల్లీ

మహా కుంభమేళా తొక్కిసలాట పట్ల స్పందించిన రాహుల్ గాంధీ- వీఐపీల అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఈ ఘటన సంభవించిందంటూ విమర్శలు.
Jan 29, 2025, 10:24 am IST
ఢిల్లీ

మహా కుంభమేళా తొక్కిసలాట పట్ల ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.
Jan 29, 2025, 9:41 am IST
ఢిల్లీ

మహా కుంభమేళా తొక్కిసలాట పట్ల అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఘటన కలచివేసిందని పేర్కొన్నారు.
Jan 29, 2025, 9:32 am IST
ఉత్తర్ ప్రదేశ్

మహా కుంభమేళాలో ఈ నెల 28వ తేదీ వరకు 19.94 కోట్ల మంది పుణ్యస్నానాలను ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
Jan 29, 2025, 9:22 am IST
ఉత్తర్ ప్రదేశ్

మౌని అమావాస్యను పురస్కరించుకుని మహా కుంభమేళా త్రివేణి సంగమంలో యధాతథంగా పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. ఈ తెల్లవారుజామున 6 గంటల వరకు 1.75 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు.
Jan 29, 2025, 8:44 am IST
ఉత్తర్ ప్రదేశ్

మౌని అమావాస్యను పురస్కరించుకుని మహా కుంభమేళా త్రివేణి సంగమంలో అమృత్ స్నానాలను ఆచరించడానికి తరలివస్తోన్న లక్షలాదిమంది భక్తులతో ప్రయాగ్ రాజ్ క్రిక్కిరిసిపోయింది. సంగమం ఘాట్లన్నీ జనసంద్రంగా మారాయి.
Jan 29, 2025, 8:25 am IST
ఉత్తర్ ప్రదేశ్

ప్రయాగ్‌రాజ్‌ త్రివేణి సంగమం వద్ద గల ఇతర ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు యధాతథంగా కొనసాగుతున్నాయి. మౌని అమావాస్యను పురస్కరించుకుని యోగా గురు రామ్‌దేవ్ బాబా, బీజేపీ లోక్‌సభ సభ్యురాలు హేమా మాలిని అమృత్ స్నానాలను ఆచరించారు.
Jan 29, 2025, 8:05 am IST
ఉత్తర్ ప్రదేశ్

త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద స్నానాలను చేయడానికి రావొద్దని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు. తమకు అందుబాటులో, దగ్గరలో ఉన్న ఘాట్ల వద్ద స్నానం చేయాలని కోరారు.
Jan 29, 2025, 7:48 am IST
ఉత్తర్ ప్రదేశ్

తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని మౌని అమావాస్య నాటి అమృత్ స్నాన్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నామని నిరంజన అఖారా పరిషత్ చీఫ్ కైలాసానంద గిరి మహరాజ్ వెల్లడించారు.
Jan 29, 2025, 7:44 am IST
ఉత్తర్ ప్రదేశ్

మహా కుంభ మేళా తొక్కిసలాటలో గాయపడ్డ వారిని ప్రయాగ్‌రాజ్ మోతీలాల్ నెహ్రూ ఆసుపత్రి, సెక్టార్ 2లో ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు.
Jan 29, 2025, 7:42 am IST
ఉత్తర్ ప్రదేశ్

మహా కుంభ మేళా 2025లో తొక్కిసలాటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆయన ఫోన్ కాల్ చేయడం గంట వ్యవధిలో ఇది రెండోసారి. ఇప్పటివరకు తీసుకున్న చర్యల గురించి యోగిని అడిగి తెలుసుకున్నారు.
Jan 29, 2025, 7:36 am IST
ఉత్తర్ ప్రదేశ్

త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద అర్ధరాత్రి దాటిన తరువాత ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇక్కడి ఘాట్ల వద్దకు వెళ్లే మార్గం మొత్తం భీతావహంగా కనిపించింది. బ్యారికేడ్లన్నీ ఎక్కడికక్కడ పడిపోయి కనిపించాయి.
Jan 29, 2025, 7:31 am IST

మహా కుంభ మేళాలో తొక్కిసలాటపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. గాయపడ్డ వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని ఆదేశించారు.
Jan 29, 2025, 7:28 am IST
ఢిల్లీ

మహా కుంభ మేళా 2025లో తొక్కిసలాటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సంఘటనపై ఆరా తీశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Jan 29, 2025, 7:09 am IST

మహాకుంభమేళలో విషాదం.15 మంది మృతి చెందినట్లుగా సమాచారం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+