మనసు మార్చుకున్న మహా నాయకుడు, హైకమాండ్ ఏం చెప్పింది, పోతేపోని వదిలేయ్ ?
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. శనివారం ముంబాయిలో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ నేను పరుగెత్తడం లేదు, రాజీనామా చెయ్యడం లేదని, తన మనసు మార్చుకున్నాను అంటూ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.
లోక్‌సభ ఎన్నికల్లో మహరాష్ట్రలో బీజేపీ ఓటమి చవిచూడటంతో తాను రాజీనామా చేస్తానని డీసీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. దాని తరువాత శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు. బీజేపీ సీనియర్ నేత అమిత్ షాతో దేవేంద్ర ఫడ్నవీస్ చర్చలు జరిపారు. ఈ భేటీ అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్ తన రాజీనామాను ఉపసంహరించుకునే విషయమై మాట్లాడారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిందని ఫడ్నవీస్ అన్నారు.

మహారాష్ట్రలో 48 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. కాంగ్రెస్ 13 సీట్లు, బీజేపీ 9 సీట్లు, శివసేన (ఠాక్రే వర్గం) 9 సీట్లు గెలుచుకున్నాయి. మహారాష్ట్ర బీజేపీ యూనిట్ అధ్యక్షుడు చంద్రశేఖర బవాన్‌కులే. అయితే దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నందున లోక్‌సభ ఎన్నికల ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని చెప్పారు. మహారాష్ట్ర రాష్ట్రంలో పార్టీని నేనే ముందుండి నడిపిస్తున్నానని అన్నారు.
అలాంటి ఫలితానికి నేనే పూర్తి బాధ్యత వహిస్తానని, నన్ను అన్ని ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పించాలని పార్టీ హైకమాండ్‌ని కోరుతానని ఫడ్నవీస్ ఇటీవల మీడియాతో అన్నాను.. అప్పుడే వచ్చే ఎన్నికల కోసం పార్టీ పనిని పట్టుదలతో చేసేందుకు నాకు సౌకర్యంగా ఉంటుందని, అందుకే తన డీసీఎం పదవికి రాజీనామా చేస్తానని ఫడ్నవీస్ చెప్పారు. అయితే ఢిల్లీ పర్యటనలో అమిత్ షా మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగాలని, నువ్వు డీసీఎంగా ఉండాలని ఫడ్నవీస్ కు సూచించారని వెలుగు చూసింది.

తనను మహారాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగాలని అమిత్ షా సలహా ఇచ్చారని, అందుకే తన రాజీనామాను ఉపసంహరించుకుంటానని దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాకు చెప్పారు. రాష్ట్రంలో మేం కోరుకున్నన్ని సీట్లు సాధించలేకపోయామని.. కానీ మహారాష్ట్రలో మాత్రం భవిష్యత్తు వ్యూహాన్ని రూపొందించుకునేందుకు ఓ సభ నిర్వహించబోతున్నామని, రాష్ట్ర ఎన్నికలకు స్పష్టమైన దిక్సూచి ఉందని ఫడ్నవీస్ అన్నారు.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి నేనే నాయకత్వం వహించాను, అందుకే ఈ ఓటమికి నేనే కారణమని చెప్పాను. నన్ను ఆ సీటు వదిలేసేందుకు అనుమతించాలని నేతలను కోరాను. నేతలకు నాపై నమ్మకం ఉంది. భావోద్వేగంతో నేనేమీ నిర్ణయం తీసుకోలేదు. అని ఫడ్నవీస్ అన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, అందులో ఎలాంటి అనుమానం లేదని బీజేపీ నాయకులు అంటున్నారు.
-
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications