మహా ఎన్నికల వేళ షిండే సర్కార్ భారీ ప్లాన్-15 లక్షల ఓబీసీలకు లబ్ది..!

ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా ఓటర్లను బుజ్జగించేందుకు షిండే సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బల నేపథ్యంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీ-శివసేన-ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 15 లక్షల మందికి లబ్ది చేకూరబోతోంది.

రాష్ట్రంలో ఓబీసీలకు ప్రస్తుతం రిజర్వేషన్లు పొందేందుకు అమల్లో ఉన్న 8 లక్షల ఆదాయ పరిమితిని 15 లక్షలకు పెంచేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని నిన్న సమావేశమైన మహారాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నాన్-క్రీమీలేయర్ ఆదాయ పరిమితి పెంపు కోసం ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. తద్వారా రిజర్వేషన్ల ఫలాలు మరింత ఎక్కువ మందికి అందుతాయని ప్రభుత్వం చెబుతోంది.

Maharashtra government big plan ahead of polls to impress obc communities

రాష్ట్రంలో భారీ ఎత్తున్న ఉన్న ఓబీసీలకు పూర్తిగా రిజర్వేషన్ల ఫలాలు అందించడం వీలు కావడం లేదు. దీనికి ప్రధాన కారణం నాన్-క్రీమీలేయర్ ఆదాయ పరిమితే. అందుకే మరింత ఎక్కువ మందికి రిజర్వేషన్ల ప్రయోజనం కల్పించేందుకు వీలుగా ఈ పరిమితి పెంచేలా కేంద్రానికి ప్రతిపాదనలు చేయబోతోంది. అయితే కేంద్రం దీన్ని ఆమోదిస్తే ఇతర రాష్ట్రాలు కూడా ఇదే డిమాండ్ ను తెరపైకి తెచ్చే ప్రమాదం పొంచి ఉంది. దీంతో కేంద్రం తీసుకోబోయే నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+