వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

7 నుంచి అన్నీ ప్రార్థన మందిరాలు ఓపెన్.. కానీ: ఎక్కడ అంటే..

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా ఉధృతి కాస్త తగ్గుతోంది. కేరళ, మహారాష్ట్ర మరికొన్ని రాష్ట్రాల్లోనే కరోనా ప్రభావం ఉంది. ఈ క్రమంలో ఉద్దవ్ థాకరే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చేనెల 7వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్నీ ప్రార్థన మందిరాలను తెరుస్తామని ప్రకటించారు. ఆ రోజు దసరా శరన్నవాత్రులు ప్రారంభం అవనున్న సంగతి తెలిసిందే. అయితే కోవిడ్ ప్రొటోకాల్ మాత్రం కంపల్సరీ అని స్పష్టంచేశారు.

సెకండ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన సీఎంవో కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. థర్డ్ వేవ్ వస్తుందనే ఊహాగానాలు మాత్రం కొనసాగాయి. కానీ ఈ లోపు క్రమంగా షాపులు తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రార్థన మందిరాల్లో విధిగా మాస్క్ ధరించాలని.. శానిటైజర్ వాడాలని స్పష్టంచేశారు. భక్తులు కోవిడ్ నియమాలు అనుసరించే బాధ్యత సంబంధిత మందిర నిర్వహకులదేనని స్పష్టంచేసింది.

రాష్ట్రంలో మందిరాలు ఓపెన్ చేయాలని గత నెలలో బీజేపీ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్ తర్వాత గతేడాది నవంబర్‌లో ప్రార్థన మందిరాలు తెరిచారు.. కానీ సెకండ్ వేవ్ రావడంతో 2021 మార్చిలో మూసివేసిన సంగతి తెలిసిందే.

 Maharashtra: Places of worship to reopen from Oct 7, first day of Navratri

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.

Recommended Video

గణేష్ నిమజ్జనోత్సవానికి రావడం ఆనందంగా ఉందన్న భక్తులు!!

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మాస్క్ ధరించి.. శాని టైజర్ రాసుకొని కాలం వెళ్లదీయాల్సిందేనని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. వేసవిలోనే కేసుల ప్రభావం ఎక్కువగా ఉంది.

English summary
Maharashtra has decided to reopen all places of worship from October 7, the first day of Navratri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X