మహారాష్ట్ర సర్కార్ లో సంక్షోభం ? షిండే గుడ్ బై-థాక్రేలకు సీఎం ఆహ్వానం..!

మహారాష్ట్రలో (Maharashtra)ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార మహాయుతి కూటమిలో చిచ్చు రేపాయి. బీజేపీపై అసంతృప్తిగా ఉన్న సంకీర్ణ భాగస్వామి, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే పార్టీ శివసేన సహకరించకపోవడంతో నాగ్ పూర్ సహా పలు చోట్ల కాషాయ పార్టీకి షాకులు తప్పలేదు. ఈ నేపథ్యంలో షిండేపై బీజేపీ ఆగ్రహంగా ఉంది. అదే సమయంలో షిండే కూడా ప్రభుత్వానికి గుడ్ బై చెప్పేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. రాజకీయ ప్రత్యర్థులైన థాక్రే సోదరులు ఉద్ధవ్, రాజ్ తో కలిసి ఓ వేదిక పంచుకోవడం చర్చనీయాంశమైంది.

మోడీ చాణక్యం..! ఓ మంత్రి రాజీనామాతో ఖాళీ అయిన బెర్తు మరో కేంద్రమంత్రికి..!
మోడీ చాణక్యం..! ఓ మంత్రి రాజీనామాతో ఖాళీ అయిన బెర్తు మరో కేంద్రమంత్రికి..!

ఎమ్మెల్సీ ఎన్నికల సాక్షిగా మహాయుతి ప్రభుత్వంలో విభేదాలు బయటపడ్డాయి. ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ ఇందుకు శివసేనే కారణమని విమర్శలు గుప్పించగా.. ఇందులో తమ పాత్రేమీ లేదని షిండే వర్గం బదులిచ్చింది. ఈ నేపథ్యంలో ముంబైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభకు సీఎం ఫఢ్నవీస్ తో పాటు థాక్రే బ్రదర్స్ ఉద్ధవ్, రాజ్ హాజరు కావడంతో పాటు ఆయనతో చనువుగా, చర్చలు జరుపుతూ కనిపించారు. దీంతో ప్రభుత్వంలో మార్పులు జరగబోతున్నాయా అన్న చర్చ మొదలైంది.

Maharashtra Politics Fadnavis Meets Uddhav Raj Thackeray Amid Mahayuti Alliance Tensions
ఆరెస్సెస్ కోటలో కాంగ్రెస్ గెలుపు-ట్వీట్ డిలీట్ చేసుకున్న సీఎం..!
ఆరెస్సెస్ కోటలో కాంగ్రెస్ గెలుపు-ట్వీట్ డిలీట్ చేసుకున్న సీఎం..!

ఇందుకు ఊతమిచ్చేలా ఉద్ధవ్ పై సభలోనే ఫడ్నవీస్ సానుకూల వ్యాఖ్యలు చేశారు. ఉద్ధవ్‌తో తన పాత అనుబంధం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. 2019కి ముందు ఉద్ధవ్ తనకు ఫోన్ చేసినప్పుడల్లా స్పందించేవాడినని, కానీ ఆ తర్వాత ఆయన నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తూనే ఉన్నానని చెప్పారు. 2019 వరకు ఉద్ధవ్ జీ నాకు ఫోన్ చేసినప్పుడల్లా నేను వెళ్లేవాడిని. 2019 తర్వాత ఆయన నాకు ఫోన్ చేయలేదు. నేను ఆయన పిలుపు కోసం ఎదురుచూస్తూనే ఉన్నానంటూ ఫడ్నవీస్ పేర్కొన్నారు. దీంతో ఈసారైనా ఉద్ధవ్ సీఎం ఫడ్నవీస్ ఫోన్ కు స్పందించి ఆయన వద్దకు వెళ్లారా లేదా అన్న చర్చ మొదలైంది. అయితే ఈ ప్రచారాల్ని ధాక్రే బ్రదర్స్ లైట్ తీసుకుంటున్నారు. ఇది పార్టీలకతీతంగా నేతలు వ్యవహరించాల్సిన సందర్భం మాత్రమేనని వారు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+