హెచ్చరిక, బదలీ: రాజీనామా చేసిన మహారాష్ట్ర గవర్నర్

ముంబై: మహారాష్ట్ర గవర్నర్ శంకరనారాయణన్ రాజీనామా చేశారు. యూపీఏ హయాంలో నియమితమైన తనను బదిలీ చేస్తే తాను రాజీనామా చేస్తానని శంకరనారాయణన్ ముందే హెచ్చరించారు. ఆయన ప్రకటన వెలువడిన కాసేపటికే ఆయనను ఎన్డీయే గవర్నమెంట్ మిజోరంకు బదిలీ చేసింది.

దీంతో కినుక వహించిన ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తన రాజీనామా లేక పంపినట్లుగా తెలుస్తోంది. శంకరనారాయణ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. ఆయనను మిజోరాంకు బదలీ చేస్తూ ప్రభుత్వం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదేశాలు జారీ చేసింది.

Maharashtra’s governor K Sankaranarayanan, who was transferred to Mizoram, resigns

యూపీఏ నియమిత గవర్నర్లలో ఒకరైన శంకర నారాయణ గతంలోనే రాజీనామా చేయమని బీజేపీ ప్రభుత్వం కోరగా.. ఆయన నిరాకరించినట్లుగా వార్తలు వచ్చాయి. అందుకే ఇప్పుడు ఆయనను బదలీ చేసినట్లుగా భావిస్తున్నారు. 82 ఏళ్ల శంకరనారాయణన్ పదవీ కాలం 2017తో ముగియనుంది. మిజోరాంకు బదలీ చేయడంతో నిరసనగా ఆయన రాజీనామా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+