బెంగళూరులో మోదీ రోడ్ షోల్లో భారీ మార్పులు, ఒకటి కాదు రెండు రోజులు, వాన దెబ్బతో !
బెంగళూరు/జయనగర్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ హవాతో వరుసగా మరోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాన దేవుడి దెబ్బకు బెంగళూరులో నరేంద్ర మోదీ రోడ్ షోలు ఒకటికి రెండు అయ్యాయి. వాన దేవుడి దెబ్బతో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోల ప్లాన్ మొత్తం తారుమారు అయ్యింది.
కరునాడు కురుక్షేత్రంలో విన్నర్ ఎవరు ? అనే విషయంలో ఇంత వరకు క్లారిటీ లేదు. మే 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెలువడనున్నాయి. కర్ణాటక రారాజు ఎవరు అని మే 13వ తేదీ తేలిపోనుంది. ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు కర్ణాటకలో మకాం వేశారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయిన బీజేపీ నాయకులు వారి చివరి అస్త్రంగా ప్రధాని నరేంద్ర మోదీతో బెంగళూరులో రోడ్ షో ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు బెంగళూరులో ఒకే రోజు ప్రధాని నరేంద్ర మోదీతో రెండు రోడ్ షొలు నిర్వహించడానికి నాయకులు ఏర్పాట్లు చేస్తూ పక్కాప్లాన్ చేశారు.
అయితే బెంగళూరులో విపరీతమైన వనాలు పడుతుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలు రెండు రోజులు నిర్వహించాలని బీజేపీ నాయకులు డిసైడ్ అయ్యారు. శనివారం, ఆదివారం బెంగళూరులో రెండు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. గుజరాత్ లోని అహమ్మదాబాద్ మోడల్ తీరుతోనే బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ క్లైమాక్స్ లో రెండు రోడ్ షోలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారని తెలిసింది.

బెంగళూరులో గత నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి, భారీ వర్షాల దెబ్బతో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలు రద్దు అయితే మొదటికే మోసం వస్తుందని అనుకున్న బీజేపీ నాయకులు శనివారం, ఆదివారం బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.
బెంగళూరులో కొన్ని రోజుల నుంచి సాయంత్రం పూట వాన దుమ్ములేపుతోంది. అందుకే శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో ఎప్పటిలాగే కొనసాగుతుందని. శనివారం సాయంత్రం నిర్వహించాల్సిన రోడ్ ఆదివారం ఉదయం 10 గంటలకు మొదలౌతుందని బీజేపీ నాయకులు తెలిపారు.
శనివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు, అలాగే ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం 1 గంట వరకు ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహిస్తారని బీజేపీ నాయకులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ బిజీగా ఉన్నారు.
శనివారం, ఆదివారం బెంగళూరులో 38 కిలోమీటర్ల దూరం ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలు నిర్వహించనున్నారు. శనివారం ప్రధాని నరంద్ర మోదీ బెంగళూరులోని ఐదు నియోజక వర్గాల్లో రోడ్ షో నిర్వహిస్తారు. ఆదివారం మిగిలిన ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహిస్తారు. శనివారం, ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలు నిర్వహించే పరిసర ప్రాంతాల్లో వాహన సంచారం నిషేధించామని బెంగళూరు సిటీ పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications