నమ్మించి గొంతు కోశారు కదరా.. లొకేషన్స్ బాగుంటాయని టూరిస్ట్ లను పహల్గాం తీసుకెళ్లింది వీడే

జమ్ము కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది. ఉగ్రవాదుల్ని ఏరిపారేసేందుకు భారత ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో పహల్గాం ఉగ్రదాడిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అనంత్ నాగ్ జిల్లాలోని బైసరన్ లోయకు టూరిస్టులను గుర్రాలపై తీసుకెళ్లిన అయాజ్ అహ్మద్ అనే వ్యక్తిని జమ్ముకశ్మీర్ లోని గందర్బాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయాజ్ అహ్మద్ ఓ మహిళా టూరిస్టును మతం అడిగినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాక అనేక మంది టూరిస్ట్ లకు మాయ మాటలు చెప్పి మరీ లొకేషన్స్ బాగుంటాయని పహల్గాం తీసుకెళ్లినట్లు తేలింది. ప్రస్తుతం ఇతడ్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. మరోవైపు ఇతను టూరిస్టుల రాకను ఉగ్రవాదులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై లోతుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

Major Development Emerges in Pahalgam Terror Attack Probe

మరోవైపు పహల్గాం ఉగ్రకుట్రకు సూత్రధారి.. 26/11 ముంబై దాడుల కుట్రదారుడు, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ గా భద్రతా దళాలు గుర్తించాయి. హఫీజ్ సయూద్ ఆధ్వర్యంలోనే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగినట్లుగా భద్రతా సంస్థలు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు పహల్గాం ఉగ్రదాడితో అప్రమత్తమైన భద్రతాబలగాలు జమ్మూకాశ్మీర్‌లో సాగిస్తున్న ఉగ్రవేటలో కీలక విజయం సాధించాయి.

తాజాగా లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ అల్తాఫ్‌ లల్లీని మట్టుబెట్టాయి. అలాగే ఉగ్రవాదుల ఆచూకీ ఇచ్చిన వారికి రూ. 20 లక్షలు బహుమతిగా ఇస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+