పొరబాటున ఎన్డీయే సర్కార్-ఏ క్షణమైనా కూలిపోవచ్చన్న ఖర్గే..!
ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బొటాబొటీ విజయంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీయే మిత్రపక్షాలపై ఆధారపడక తప్పని పరిస్ధితి. దీంతో ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వం భాగస్వాములపై ఐదేళ్ల పాటు ఆధారపడాల్సిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే ప్రభుత్వం పొరబాటున ఏర్పాటైందదని, అది ఏ క్షణమైనా కూలిపోవచ్చంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఖర్గే వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
కేంద్రంలో పొరపాటున ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడిందని, మోడీకి ప్రజా మద్దతు లేదని ఖర్గే తెలిపారు. ఇది మైనారిటీ ప్రభుత్వమని, ఈ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చని ఖర్గే వెల్లడించారు. ఈ ప్రభుత్వం కొనసాగాలని తాము కోరుకుంటున్నామని, అయితే దేశానికి మేలు జరగాలనేదే తమ ఉద్దేశమన్నారు. దేశం పటిష్టంగా ఉండేందుకు మనం కలిసి ముందుకు సాగాలన్నారు. కానీ మన ప్రధానమంత్రికి అలాంటి చర్యలు కొనసాగించే ఉద్దేశం లేదన్నారు. కానీ తాము మాత్రం దేశ పటిష్టతకు కృషి చేస్తామన్నారు.

అయితే కొత్తగా ఏర్పడిన మోడీ సర్కార్ పై అంతలోనే విపక్ష నేత ఖర్గే చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే మిత్రపక్షాలు బీజేపీకి ఎంతో కాలం సహకరించవనే సంకేతం ఇచ్చినట్లు కనిపిస్తోంది. దేశ చరిత్రలోనే అత్యంత బలమైన విపక్షం ఇండియా కూటమి రూపంలో మోడీ సర్కార్ కు సవాల్ విసురుతోంది. అదే సమయంలో విపక్షాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఈసారి ఎన్డీయే సర్కార్ ముందుకెళ్లే పరిస్ధితి లేదు. దీంతో ఖర్గే వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications