దూకుడు తగ్గించిన దీదీ..! పరిస్ధితుల ప్రభావమేనా..?

కోల్ కత/హైదరాబాద్ : రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎన్నికల ముందు ఉన్న హడావిడి ఎన్నికల తర్వాత కనిపించదు. నాయకుల దూకుడు స్వభావం కూడా ఎన్నికల ముందు తారా స్ధాయిలో ఉంటుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రం ముసురుకున్న మేఘాలు మొత్తం కరిగిపోయినట్టు సామాన్య స్ధితికి చేరుకుంటారు. ఎన్నికల్లో గెలిస్తామని అతి విశ్వాసం, లేని ప్రజా బలాన్ని తమకే ఉందని ఆపాదించుకోవడం, ప్రజల నాడి సరిగ్గా తెలుసుకోలేక పోవడం, చుట్టూ ఉన్న సొంత మనుషులు తప్పుదారి పట్టించడం వంటి చర్యలతో అత్యంత ప్రభావవంతమైన నేతలు కూడా అతి సాధారణ స్థితికి చేరుకుంటారు. దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిస్థితి అచ్చం ఇలాగే తయారయ్యింది.

మారిన మమత బెనర్జీ..! బీజేపి పై తగ్గించిన దూకుడు..!!

మారిన మమత బెనర్జీ..! బీజేపి పై తగ్గించిన దూకుడు..!!

రాజకీయాల్లో ప్రతి అంశాన్ని రచ్చ చేసే మమతా బెనర్జీ తన దూకుడును పూర్తిగా తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. కాషాయ పార్టీ అంటేనే భగ్గుమనే మమత బెనర్జీ గత సార్వత్రిక ఎన్నికల వరకూ బీజేపితో గట్టి పోరాటం చేసారు. కేంద్ర సీబీఐని కోల్ కతాలో అడుగు పెట్టనీయకుండా అడ్డు కోవడం, స్థానిక బీజేపి నాయకులపై కేసులు బనాయించడం, మోదీ ప్రభుత్వానికి సవాళ్లు విసరడం, థర్డ్ ఫ్రంట్ పేరుతో హడావిడి చేయడం వంటి చర్యలతో బీజేపికి చుక్కలు చూపించినంత పని చేసింది మమతా బెనర్జీ. కాని ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఘోర పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సొంత ఎపీలు చాలా మంది ఓటమి పాలవ్వడం, కేంద్రంలో మళ్లీ బీజేపి అదికారంలోకి రావడం, థర్డ్ ఫ్రంట్ గల్లంతైపోడంతో మమతా రాజకీయాల్లో తన స్వభావాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది.

అమిత్ షా వ్యాఖ్యల పట్ల స్పందిచని దీదీ..! హోం మంత్రితో భేటీ..!!

అమిత్ షా వ్యాఖ్యల పట్ల స్పందిచని దీదీ..! హోం మంత్రితో భేటీ..!!

దీంతో కేంద్ర బీజేపి ప్రభుత్వ విధానాల పైన గతంలో నిప్పులు చెరిగిన మమత అందుకు విరుద్దంగా, ప్రస్తుత పరిస్ధితులకు తగ్గట్టు నడుచుకుంటున్నట్టు తెలుస్తోంది. విమర్శించాల్సిన సందర్బం వచ్చినా కూడా నోరు మెదపడం లేదు. దేశం మొత్తం హిందీ భాషనే మాట్లడాలి అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించినప్పుడు దక్షిణ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తుల నిరసనలు వెల్లవెత్తాయి. కాని మమతా బెనర్జీ మాత్రం ఒక్క మాట కూడా మాట్లడ లేదు. దీంతో దీదీ దూకుడును ఎంతగా తగ్గించుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. అంతే కాకుండా ప్రధాని మోదీ తో భేటీ ఐన మమతా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అది చాలక పాత సమస్యలను కొత్తగా చర్చించేందుకు బీజేపి కేంద్ర మంత్రులను సంప్రదిస్తున్నారు మమత. తాజాగా కేంద్ర హోంమత్రి అమిత్ షా తో మమత బెనర్జీ భేటీ అయ్యారు. బెంగాల్ పేరు మార్చే అంశంలో ఆయనతో భేటీ ఐనట్టు మమత స్పష్టం చేస్తున్నారు.

మేం హిందీని వ్యతిరేకిస్తూనే ఉంటామన్న స్టాలిన్..! మద్దత్తు ఇవ్వని మమత..!!

మేం హిందీని వ్యతిరేకిస్తూనే ఉంటామన్న స్టాలిన్..! మద్దత్తు ఇవ్వని మమత..!!

కాగా ఒక్క పశ్చిమ బెంగాల్ లో తప్ప ఇతర రాష్ట్రల్లో అమిత్ షా వ్యాఖ్యలు అగ్గిరాజేసాయి. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒకేదేశం ఒకే భాష అంటూ చేసిన వ్యాఖ్యలతో తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత ఎదురౌతోంది. హిందీని ఎప్పటికీ తమిళనాడులో చొప్పించలేరని అన్ని పార్టీల నాయకులు వ్యతిరేకించడంతో.. హోం మంత్రి అమిత్‌షా తన వ్యాఖ్యల పట్ల స్పష్టతనిచ్చారు. హిందీని మొదటి భాషగా కాకుండా రెండో భాషగా స్వీకరించొచ్చు అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్టాలిన్ ప్రతిస్పందిస్తూ, డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆందోళన ర్యాలీని విరమించుకున్నప్పటికీ హిందీని తాము ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటామనీ, తమిళులు సైతం హిందీ భాష పట్ల సుముఖత చూపించరని అన్నారు.

పాత సమస్యలు..! కొత్త సమావేశాలతో మమత బిజీ..!!

పాత సమస్యలు..! కొత్త సమావేశాలతో మమత బిజీ..!!

ఇదిలా ఉండగా హిందీ భాషను దేశ పౌరులపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడం లేదని, అది తమ ఉద్దేశం కూడా కాదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వివరణ ఇచ్చుకున్నారు. హిందీ భాషను దేశ వ్యాప్తంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ చర్చ జరుగుతున్న తరుణంలో అమిత్ షా ప్రతి స్పందనకు ప్రాధన్యత ఏర్పడింది. సమస్య తీవ్రతను పరిగణనలోకి తీసుకున్నా ఆయన తన వ్యాఖ్యలపై మరోసారి వివరణ ఇచ్చుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, మాతృభాష తరువాత హిందీ నేర్చుకోవాలనేదే తమ అభిమతమని, ప్రాంతీయ భాషను చిన్నచూపు చూసే ఉద్దేశం తమ ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదన్నారు. అమిత్ షా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+