హృతిక్ డ్యాన్స్ అద్భుతం... షారుఖ్, గంభీర్‌లకు మమతా అభినందనలు

కోల్‌కత్తా: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందనలు తెలిపారు. షారుఖ్ యజమానిగా ఉన్న కోల్‌‌కత్తా నైట్ రైడర్స్‌ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-8లో ఆడిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 Mamata Banerjee congratulates Shah Rukh Khan, Gautam Gambhir for KKR's win in the opening match

కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ గౌతం గంభీర్‌కు కూడా ఆమె అభినందనలు తెలిపారు. మంచి శుభారంభం, ఇలాగే కొనసాగించండి అంటూ ఆమె తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ఢిపెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఈడెన్ గార్డెన్స్‌లో ముంబై ఇండియన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోయిన మమతా బెనర్జీ, హృతిక్ రోషన్ చేసిన నృత్యాలను టీవీలో చూశానని, అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.

ఐపీఎల్ ప్రారంభోత్సం రోజున బాలీవుడ్ హీరో హృతిక్‌ రోషన్‌ కళ్లు చెదిరే ప్రదర్శనతో కార్యక్రమం ముగిసిన విషయం తెలిసిందే. తన తొలి సినిమా ‘కహోనా ప్యార్‌ హై'తో మొదలెట్టి ధూమ్‌ మచాలే పాటలకు డాన్స్‌ చేసి ప్రేక్షకులను అలరించాడు.

అనంతరం సైఫ్‌ ఆలీఖాన్ ఐపీఎల్‌-8 ప్రారంభమైనట్లు లాంఛనంగా ప్రకటించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 8వ ఎడిషన్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. 47 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నమెంట్లో మొత్తం 60 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ ఐపీఎల్ టోర్నీ 47 రోజుల పాటు జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+